Donald Trump: దేవుడు నావైపే ఉన్నాడు: డోనాల్డ్ ట్రంప్
Donald Trump: దేవుడు తన వైపు ఉన్నట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడారు. గత శనివారం హత్యాయత్నం జరిగిన తర్వాత తొలిసారి ట్రంప్ తనకు జరిగిన దాడి గురించి పబ్లిక్‌గా వివరించారు. రక్తం చిందుతున్నా.. తాను సురక్షితంగా ఉన్నట్లు ఫీలయ్యాయని, ఎందుకంటే దేవుడు తన వైపు ఉన్నాడని ట్రంప్ పేర్కొన్నారు.
మిల్వాకీ: దేవుడు తన వైపు ఉన్నట్లు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడారు. గత శనివారం హత్యాయత్నం జరిగిన తర్వాత తొలిసారి ట్రంప్ తనకు జరిగిన దాడి గురించి పబ్లిక్‌గా వివరించారు. రక్తం చిందుతున్నా.. తాను సురక్షితంగా ఉన్నట్లు ఫీలయ్యాయని, ఎందుకంటే దేవుడు తన వైపు ఉన్నాడని ట్రంప్ పేర్కొన్నారు. చివరి క్షణంలో తాను తన తల తిప్పకుండా ఉంటే, అప్పుడు ఆ బుల్లెట్ సరిగ్గా లక్ష్యాన్ని తాకేదని, ఈ రోజు ఇలా మీతో ఉండేవాడిని కాదు అని ట్రంప్ చెప్పారు. దేవుడి దయవల్లే మీముందు నిలబడినట్లు తెలిపారు. రిపబ్లికన్ అభ్యర్థిగా దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీపడేందుకు ట్రంప్ నామినేషన్ స్వీకరించారు.
రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ ఓ ఫ్యామిలీ వేడుకలా మారింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఆ మీటింగ్‌కు ట్రంప్ ఫ్యామిలీ మొత్తం హాజరైంది. వీఐపీ బాక్సులో ట్రంప్ కుటుంబసభ్యులు కనిపించారు. ఆ మీటింగ్ ద్వారా ఫ్యామిలీమ్యాన్ అన్న సంకేతాన్ని ఆయన అందించారు. తన ప్రసంగం వేళ భార్య మెలానియా, కుటుంబసభ్యులకు థ్యాంక్స్ తెలిపారు.
తనపై నమోదు అయిన క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల కేసును ఫ్లోరిడా కేసు కొట్టివేసినట్లు ట్రంప్ తెలిపారు. అత్యంత గౌరవప్రదమైన ఫెడరల్ జడ్జి ఆ తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. జడ్జి ఎలీన్ కానన్ ఇచ్చిన తీర్పును న్యాయశాఖ సవాల్ చేసిందని, ఒకవేళ దేశం ఐక్యంగా ఉండాలని డెమోక్రాట్లు భావిస్తే, అప్పుడు ఆ కేసును డ్రాప్ చేసుకోవాలని ట్రంప్ తెలిపారు.
టిప్‌లపై ట్యాక్స్ ఉండదని ట్రంప్ తెలిపారు. ఒకవేళ మీరు రెస్టారెంట్ వర్కర్ అయినా, బార్డెంటర్ అయినా, హాస్పిటాలిటీ వర్కర్, బార్బర్, డ్రైవర్ అయినా.. వంద శాతం మీ టిప్స్ మీవే అని ట్రంప్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. టిప్స్ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను వసూల్ చేస్తున్నారని, కానీ ఆ పన్నును మినహాయించాలని ట్రంప్ భావిస్తున్నారు. లాస్ వెగాస్‌లోని ఓ హోటల్లో వెయిట్రెస్‌తో మాట్లాడిన తర్వాత తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
పెన్సిల్వేనియాలో జరిగిన కాల్పుల సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఫైర్ ఫైటర్‌కు ట్రంప్ నివాళి అర్పించారు. కుటుంబసభ్యుల్ని కాపాడుకునే సమయంలో 50 ఏళ్ల ఫైర్ చీఫ్ ముందుకు దూకాడు. ఆ సమయంలో బుల్లెట్ తగిలి అతను ప్రాణాలు కోల్పోయాడు. ఫైర్‌ఫైటర్ దుస్తులను కన్వెన్షన్‌లో ప్రదర్శించి, అతడికి నివాళి అర్పించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

