Apple Iphone | డిలీట్ చేసిన మెసేజ్‌లు చూసిన భార్య విడాకులు.. యాపిల్‌పై 53 కోట్లకు భర్త దావా
తాను డిలీట్ చేసిన మెసేజ్‌లు చూసిన భార్య విడాకులకు దరఖాస్తు చేయడంతో తట్టుకోలేకపోయిన ఓ వ్యాపారవేత్త టెక్ దిగ్గజం యాపిల్‌పై రూ.53 కోట్లకు దావా వేశాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఆయన తన ఐఫోన్‌లోని ఐ మెసేజ్ యాప్ నుంచి సెక్స్ వర్కర్లతో చాట్ చేసేవాడు. అవి భార్య కంట పడకుండా డిలీట్ చేస్తూ జాగ్రత్త పడేవాడు.
Apple Iphone | లండన్: తాను డిలీట్ చేసిన మెసేజ్‌లు చూసిన భార్య విడాకులకు దరఖాస్తు చేయడంతో తట్టుకోలేకపోయిన ఓ వ్యాపారవేత్త టెక్ దిగ్గజం యాపిల్‌పై రూ.53 కోట్లకు దావా వేశాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఆయన తన ఐఫోన్‌లోని ఐ మెసేజ్ యాప్ నుంచి సెక్స్ వర్కర్లతో చాట్ చేసేవాడు. అవి భార్య కంట పడకుండా డిలీట్ చేస్తూ జాగ్రత్త పడేవాడు. అయితే, తన ఫోన్ ఐడీనే కుటుంబం ఉపయోగించే ఐమ్యాక్కు లింక్ చేసిన విషయాన్ని మర్చిపోయాడు. చాటింగ్ మెసేజ్‌లను ఫోన్లో డిలీట్ చేసినప్పటికీ ఐమ్యాక్‌లో అలానే ఉండిపోయాయి. ఒకరోజు వాటిని చూసిన ఆయన భార్య.. విడాకులకు దరఖాస్తు చేసింది.
దీంతో సదరు వ్యాపారవేత్త యాపిల్‌పై కోర్టుకెక్కాడు. విడాకులు మంజూరైతే ఆమెకు దాదాపు రూ. 53 కోట్లు చెల్లించాల్సి వస్తుందని, కాబట్టి వాటిని ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఫోన్లో మెసేజ్‌లు డిలీట్ చేస్తే మొత్తంగా డిలీట్ అయ్యాయనే అనుకుంటామని, ఈ విషయంలో యాపిల్ కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నది అతడి వాదన. మెసేజ్‌లు డిలీట్ చేసినప్పుడు ఆ డివైజ్‌లో మాత్రమే డిలీట్ అయినట్టు మెసేజ్ వస్తే యూజర్లు అప్రమత్తమవుతారని, ఈ విషయంలో యాపిల్ విఫలమైందని, కాబట్టి తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని ఆ పిటిషన్లో కోరాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Apple
- apple iphone
- divorce
- MESSAGES
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

