Winter Storm: భీకర మంచు తుఫాన్.. 7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ .. వణికిపోతున్న అమెరికా
US Winter Storm: బ్లెయిర్ తుఫాన్ బెంబేలెత్తిస్తున్నది. ఆ మంచు తుఫాన్ ధాటికి అమెరికా గజగజలాడుతోంది. పోలార్ వర్టిక్స్తో వీస్తున్న అతిశీతల గాలుల వల్ల.. సెంట్రల్ అమెరికాలోని ఏడు రాష్ట్రాలు స్నోఫాల్‌తో నిండిపోతున్నాయి. వేల విమానాలు రద్దయ్యాయి. హైవేలపై కార్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మైనస్ ఉష్ణోగ్రతులు నమోదవుతున్నాయి.
న్యూయార్క్: అమెరికాపై మంచు తుఫాన్(winter storm) అటాక్ చేసింది. వింటర్ స్టార్మ్ సుమారు 6 కోట్ల మంది అమెరికన్లపై తీవ్ర ప్రభావం చూపనున్నది. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. కాన్సాస్ సిటీపై పెను ప్రభావం పడింది. మిస్సోరీ, కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, అర్కాన్సాస్, న్యూజెర్సీ రాష్ట్రాల్లోనూ మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్నది. మంచు తుఫాన్‌కు బ్లెయిర్‌గా నామకరణం చేశారు. సుమారు 30 రాష్ట్రాల్లో ఆ తుఫాన్ ప్రభావం ఉన్నది. బ్లెయిర్ మంచు తుఫాన్ వల్ల.. అధిక స్థాయిలో మంచు, ఐస్, సబ్ జీరో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
పోలార్ వొర్టెక్స్ వల్ల విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న చల్లటి గాలి.. సెంట్రల్ అమెరికాను ప్రస్తుతం వణికిస్తున్నది. ఇప్పటికే వేల సంఖ్యలో విమానాలు ఆలస్యం అవుతున్నాయి. కొన్నింటిని రద్దు కూడా చేశారు. తుఫాన్ వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్లు జామయ్యాయి. స్కూళ్లను మూసివేశారు. సోమవారం తర్వాత పరిస్థితులు మెరుగయ్యే అవకాశాలు ఉన్నట్లు వెదర్ శాఖ తెలిపింది.
కాన్సాస్ సిటీలో 32 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ స్థాయిలో మంచు కురిసింది. రానున్న కొన్ని రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా పడిపోనున్నాయి. మైనస్ 10 నుంచి 15 డిగ్రీలకు పడిపోయే ఛాన్సు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాన్సాస్కు ప్రత్యేకంగా అలర్ట్ జారీ చేశారు. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దు అన్నారు.
ఫిలడెల్పియాలో స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులను మూసివేశారు. మిస్సోరీ, ఇలియనాస్, లూసియానా, కెంటకీ రాష్ట్రాల్లో.. సుమారు రెండు లక్షల ఇండ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. భీకరంగా కురుస్తున్న మంచు, వర్షం వల్ల.. కాన్సాస్ విమానాశ్రయాన్ని మూసివేశారు. మంచు తుఫాన్ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో.. వందల సంఖ్యలో కారు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. మిస్సోరీలో దాదాపు 600 వాహనాలు హైవేపై మంచులో చిక్కుకుపోయాయి. వర్జీనియా రాష్ట్రంలో 135 ప్రమాదాలు జరిగాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | నిన్న ఖజాన, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

