Texas Oil Refinery: టెక్సాస్ ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు.. వీడియో
Texas oil refinery : అమెరికాలోని ఓ ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. టెక్సాస్‌లోని పోర్ట్ ఆర్థర్‌లో ఉన్న వలెరో రిఫైనరీలో ఈ ఘటన చోటుచేసుకున్నది. భారీ ఎత్తును మంటలు వ్యాపించాయి. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్ముకున్నది.
టెక్సాస్: అమెరికాలోని ఓ ఆయిల్ రిఫైనరీ(Texas oil refinery)లో భారీ పేలుడు సంభవించింది. టెక్సాస్‌లోని పోర్ట్ ఆర్థర్‌లో ఉన్న వలెరో రిఫైనరీలో ఈ ఘటన చోటుచేసుకున్నది. భారీ ఎత్తును మంటలు వ్యాపించాయి. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్ముకున్నది. పేలుడు సమయంలో భారీ శబ్ధం వచ్చినట్లు స్థానికులు చెప్పారు. కొన్ని మైళ్ల దూరం వరకు భూమి కంపించినట్లు వెల్లడించారు. పోర్ట్ ఆర్థర్‌లో అప్రమత్తత ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారి గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదని జెఫర్సన్ కౌంటీ షరీఫ్ జీనా స్టీఫెన్స్ తెలిపారు.
ఏ కారణం చేత పేలుడు జరిగిందో ఇంకా నిర్ధారించలేకపోయినట్లు పోర్ట్ ఆర్థర్ ఫైర్ డిపార్టమెంట్ చీఫ్ ఆంటోనియో మిచెల్ పేర్కొన్నారు. టెక్సాస్ గల్ఫ్ కోస్టులో ఉన్న రిఫైనరీల్లో వలెరో అతిపెద్దది. ఇక్కడ ప్రతి రోజు సుమారు నాలుగున్నర లక్షల బ్యారెళ్ల క్రూయిడ్ ఆయిల్‌ను రిఫైన్ చేస్తారు. ఇరాన్‌పై దాడి వల్ల ప్రస్తుతం అమెరికాలో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇక పోర్ట్ ఆర్థర్ రిఫైనరీ పేలుడు ఘటనతో పరిస్థితి మరింత తీవ్రం కానున్నట్లు భావిస్తున్నారు.
A view of the Valero incident from above – Caught by crop duster Pilot Coda Riley pic.twitter.com/7kjym6PjSo
— KFDM News (@kfdmnews) March 24, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Black smoke
- huge fire
- Texas
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

