నక్షత్ర జననం.. హబుల్‌కు చిక్కిన ఖగోళ అద్భుతం
టెక్సాస్: ఖగోళ రహస్యాలను చిత్రీకరిస్తున్న హబుల్ టెలిస్కోప్‌కు తాజాగా మరో అద్భుతం చిక్కింది. రోదసిలో సుదూర తీరాల్లో కొత్తగా ఉద్భవిస్తున్న ఓ నక్షత్ర జనన ప్రక్రియను హబుల్ తన కెమెరాల్లో బంధించింది. నక్షత్రం పుట్టుకకు సంబంధించిన ఫోటోలను నాసా రిలీజ్ చేసింది. హబుల్ ట్విట్టర్లో ఈ ఫోటోలను కూడా షేర్ చేశారు. కొత్త నక్షత్ర జనన సమయంలో ఉద్భవించే శక్తిని ఈ ఫోటోలను చూడవచ్చు. ఎ స్టార్ ఈజ్ బార్న్ అని హబుల్ ట్విట్టర్లో నక్షత్ర జననం గురించి ఓ ట్వీట్ చేసింది. ధ్వనికన్నా అధిక వేగంతో వెలుగులుచిమ్ముతూ వెళ్తున్న వాయుగోళానికి సంబంధించిన ఫోటోను హబుల్ రిలీజ్ చేసింది.
జెట్ మాదిరిలా వెళ్తున్న ఆ పదార్ధం.. అప్పుడే ఉద్భవిస్తున్న నక్షత్రాన్ని ఢీకొట్టుతోంది. ఆ సమయంలో కళ్లు మిరుమిట్టుగొలిపే వెలుగు పుట్టినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీన్నే హెర్బిగ్-హరో పదార్ధం అంటారని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హర్బిగ్-హరో వస్తువును HH34గా పిలుస్తారు. 1994 నుంచి 2007 మధ్య ఓ సారి ఈ ఆబ్జెక్ట్‌ను కూడా హబుల్ పసికట్టింది. HH34 ఆబ్జెక్ట్ సుమారు 1250 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. ఆ ప్రాంతాన్ని ఓరియన్ నెబులా అంటారు. భూమికి సమీపంగా ఉన్న నక్షత్ర జనన ప్రాంతం ఇదే. నక్షత్రాలు, గ్రహ వ్యవస్థ ఇక్కడి నుంచే ఏర్పడుతున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

