సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్ వాసి మృతి
సౌదీ అరేబియా-హౌతీ తిరుగుబాటుదారుల మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకుంటున్నది. యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతున్న హౌతీలు రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఎయిర్‌పోర్టుపై వరుస దాడులకు తెగబడుతున్నారు. శనివారం జరిపిన దాడుల్లో హైదరాబాద్‌లోని మెహదీపట్నంకు చెందిన మహమ్మద్ యూసుఫ్ అలీ సహా 13 మంది మృతిచెందగా, 309 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 11 మంది భారతీయులున్నారు.
- రియాద్ విమానాశ్రయంపై విరుచుకుపడ్డ హౌతీ రెబెల్స్
- శనివారం దాడిలో 13 మంది మృతి
- 10 మంది భారతీయులకు గాయాలు
రియాద్: సౌదీ అరేబియా-హౌతీ తిరుగుబాటుదారుల మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకుంటున్నది. యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతున్న హౌతీలు రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఎయిర్‌పోర్టుపై వరుస దాడులకు తెగబడుతున్నారు. శనివారం జరిపిన దాడుల్లో హైదరాబాద్‌లోని మెహదీపట్నంకు చెందిన మహమ్మద్ యూసుఫ్ అలీ సహా 13 మంది మృతిచెందగా, 309 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 11 మంది భారతీయులున్నారు. యూసుఫ్ ఇద్దరు కుమారులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య, కూతురు క్షేమంగానే ఉన్నారు. ఆయన మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకొస్తామని సౌదీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది..
ఆదివారం మరోసారి దాడులు..
ఆదివారం మరోసారి రియాద్ ఎయిర్‌పోర్టుతో పాటు దమ్మం ఎయిర్‌పోర్టు, ఆరామ్ కో ఆయిల్ రిఫైనరీ కేంద్రం మీద హౌతీలు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఒక మిస్సైల్‌ను నేలకూల్చినట్టు సౌదీ భద్రతా దళాలు తెలిపాయి. దాడిలో ఎయిర్‌పోర్టులోని పలు విమానాలు ధ్వంసం అయ్యాయని, తాత్కాలికంగా ఎయిర్‌పోర్టును మూసివేస్తున్నట్టు సౌదీ పౌర విమానయాన సంస్థ ప్రకటించింది. అలాగే శనివారం దాడిలో గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్న దవాఖానతో విదేశాంగశాఖ టచ్‌లో ఉన్నట్టు తెలిపింది. చనిపోయిన 12 మందిలో నలుగురు సౌదీ పౌరులు, ఇద్దరు బంగ్లా దేశీయులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై హౌతీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నాలుగు రోజుల కింద జరిగిన దాడిలో ఒక పైలట్ సహా ముగ్గురు చనిపోయారు. వారంలోనే మూడోసారి ఎయిర్‌పోర్టుపై దాడి జరగడంతో సౌదీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

