చికాగో, అక్టోబర్ 30: ఎప్పుడుపడితే అప్పుడు ఉపవాసం ఉంటే మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని పరిశోధకులు హెచ్చరించారు. మెనోపాజ్ దాటిన, దాటని మహిళలపై పరిశోధన చేయగా, ఒక క్రమంగా ఉపవాసం ఉండేవారిలో హార్మోన్లు పెద్దగా ప్రభావం చూపలేదని చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ శాస్త్రవేత్త క్రిస్టా వరాడీ తెలిపారు. క్రమం లేకుండా ఉపవాసం చేసినవారిలో హార్మోన్ల శైలి మారిందని పేర్కొన్నారు.