Swaminarayan Temple | కెనడాలో స్వామి నారాయణ్ ఆలయంపై మరోసారి దాడి.. ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలు
కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ్మింటన్లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ (Swaminarayan Temple) ఆలయంపై దుండగులు గ్రాఫిటీ పెయింట్ (Graffiti) వేశారు. ప్రధాని మోదీ, భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కెనడా వ్యతిరేకులు అంటూ ఆలయ గేటుపై రాశారు.
టొరంటో: కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ్మింటన్లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ (Swaminarayan Temple) ఆలయంపై దుండగులు గ్రాఫిటీ పెయింట్ (Graffiti) వేశారు. ప్రధాని మోదీ, భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కెనడా వ్యతిరేకులు అంటూ ఆలయ గేటుపై రాశారు. దీనిపై కెనడాలోని విశ్వహిందూ పరిషత్ మండిపడింది. తీవ్రవాద భావజాలంతో కొందరు హెచ్చుమీరుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మన దేశంలో శాంతిని ప్రేమించే హిందూ సమాజంపై ద్వేషాన్ని చిమ్ముతున్న తీవ్రవాద భావజాలానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని దేశంలోని అన్ని స్థాయిల ప్రభుత్వాలను కోరుతున్నామని ఎక్స్ వేదికగా కోరింది.
స్వామి నారాయణ్ ఆలయం విధ్వంసాన్ని ఎంపీ చంద్ర మౌర్య ఖండించారు. ఎడ్మింటన్లో బీఏపీఎస్ స్వామి నారాయణ్ ఆలయం మళ్లీ ధ్వంసమైంది. ఖలిస్థానీ వేర్పాటువాదులు ఇలాంటి గ్రాఫిటీలు రాయడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేండ్లుగా గ్రేటర్ టొరంటో, బ్రిటిష్ కొలంబియా, కెనడాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న హిందూ దేవాలయాలు ద్వేషపూరిత గ్రాఫిటీలతో విధ్వంసానికి గురవుతున్నాయని ఎక్స్లో పేర్కొన్నారు. కెనడాలోని హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులు తరచూ జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

