బ్లెయిన్: అమెరికాలోని మిన్నెసొట రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్లెయిన్ సిటీ సమీపంలో హైవేపై వెళ్తున్న ఓ ట్రక్కును కారు ఢీకొట్టింది. అతివేగంతో ర్యాంప్ రూట్ మీదుగా హైవేపైకి వస్తున్న ఓ కారు.. అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. కారు ఢీకొనడంతో అదుపు తప్పిన ట్రక్కు హైవే సైడ్వాల్ను ఢీకొట్టింది. ఆ తక్షణమే ట్రక్కులో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ట్రక్కు పూర్తిగా మంటల్లో ధ్వంసమైంది. కానీ కారు, ట్రక్కు డ్రైవర్లు ఇద్దరూ క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్‌ను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 11వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.