Alexander Lukashenko | ఆ సమయంలో ప్రిగోజిన్ చాలా ఉల్లాసంగా ఉన్నాడు: బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో
Alexander Lukashenko | రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసి వెనక్కి తగ్గిన ప్రైవేటు సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ గురించి బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఆసక్తికర విషయాలు చెప్పారు.
బెలారస్: రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసి వెనక్కి తగ్గిన ప్రైవేటు సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ గురించి బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఆసక్తికర విషయాలు చెప్పారు. రష్యా సైనిక నాయకత్వంపై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ప్రకటించినప్పుడు బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వం వహించి.. ప్రిగోజిన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పించారు. ఆ సందర్భంగా జరిగిన సంభాషణల గురించి మీడియా అడగడంతో లుకషెంకో వెల్లడించారు.
రష్యా అడగడంతో తిరుగుబాటు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని తాను వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌ను కోరానని లుకషెంకో తెలిపారు. ఆ సందర్భంగా ప్రిగోజిన్ లాచా ఉల్లాసంగా మాట్లాడాడన్నారు. ‘తిరుగుబాటు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరేందుకు తాను ప్రిగోజిన్‌కు ఫోన్ చేశాను. ఆ సందర్భంగా ప్రిగోజిన్ చాలా ఉల్లాసంగా ఉన్నాడు. దాదాపు అరగంటపాటు ఆయన ఉత్సాహంగా మాట్లాడాడు. తాను రష్యా ప్రభుత్వంపై ఆధిపత్యం కోసం తిరుగుబాటు చేయలేదని, రష్యా సైన్యం తన బలగాలపై దాడికి పాల్పడినందుకు నిరసనగా తిరుగుబాటు ప్రకటించానని చెప్పాడు. దాంతో తిరుగుబాటు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నేను కోరాను. అందుకు ఇంత జరిగిన తర్వాత రష్యా నన్ను వదిలిపెడుతుందా..? అని ప్రిగోజిన్ నన్ను ప్రశ్నించాడు’ అని లుకషెంకో చెప్పారు.
‘దాంతో తిరుగుబాటును ఆపేసి వస్తే నేను బెలారస్లో నేను ఆశ్రయం ఇస్తానని హామీ ఇచ్చాను. తిరుగుబాటును కొనసాగించడం కంటే ఆపేయడమే మేలని అన్నాను. లేదంటే రష్యా బలగాల చేతిలో బలి కావాల్సి వస్తుందని హెచ్చరించాను. దాంతో ప్రిగోజిన్ మెత్తబడ్డాడు. తిరుగుబాటును ఆపేస్తున్నట్టు ప్రకటించి బెలారస్‌కు వచ్చాడు. ప్రస్తుతం అతను బెలారస్‌లోనే ఉన్నాడు’ అని బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో తెలిపారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రైవేట్ సైన్యమైన వాగ్నర్ గ్రూప్ రష్యా సేనలకు మద్దతుగా పనిచేసింది. అయితే, యుద్ధంలో భారీగా తన సైన్యాన్ని కోల్పోవడంతో రష్యా సేనలపై వైరం పెంచుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

