Hamas Commander: హమాస్ కమాండర్ అహ్మద్ సియామ్ హతం
Hamas Commander : గాజా ఆస్పత్రిలో వెయ్యి మందిని బందీ చేసిన హమాస్ ఉగ్రవాది, కమాండర్ అహ్మద్ సియామ్ హతమయ్యాడు. ఫైటర్ జెట్ దాడిలో అతను ప్రాణాలు కోల్పోయినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. గాజాలో ఉన్న ప్రజల తరలింపు ప్రక్రియను అహ్మద్ సియామ్ అడ్డుకున్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ దళాలు పేర్కొన్నాయి.
గాజా: హమాస్ సీనియర్ కమాండర్(Hamas Commander) అహ్మద్ సియామ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ తెలిపింది. అయితే అతను సుమారు వెయ్యి మంది వ్యక్తుల్ని గాజా ఆస్పత్రిలో బంధించినట్లు తెలుస్తోంది. గాజాలో ఉన్న ప్రజల తరలింపు ప్రక్రియను అహ్మద్ సియామ్ అడ్డుకున్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ దళాలు పేర్కొన్నాయి. రంతిసి ఆస్పత్రిలో బందీలను సియామ్ దాచిపెట్టనట్లు ఐడీఎఫ్ తెలిపింది.
హమాస్‌కు చెందిన నాసిర్ రద్వాన్ కంపెనీ కమాండరే అహ్మద్ సియామ్. గాజా సిటీలో ఉన్న అల్ బురాక్ స్కూల్లో దాచుకున్న సమయంలో జరిగిన ఫైటర్ జెట్ దాడిలో సియామ్ హతమయ్యాడు. అతనితో పాటు హమాస్ ఆపరేటివ్స్ కూడా ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
షిన్ బెట్, మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఐడీఎఫ్ ఆ దాడి చేసినట్లు తెలుస్తోంది. ద గివాటీ బ్రిగేడ్ ట్రూప్స్ .. ఫైటర్ జెట్‌ను ఆపరేట్ చేశాయి. హమాస్ ఉగ్రవాదులు నక్కి ఉన్న ప్రాంతాన్ని పేల్చేశాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

