Haiti jail | జైలు గోడలు బద్దలు కొట్టి వందల మంది ఖైదీలు పరార్..!
Haiti jail | హైతీ దేశ రాజధాని పోర్ట్ ఆ ప్రిన్స్ (Port-au-Prince) రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్రమైన నేరాలు చేసిన వారిని బంధించే ప్రధాన జైలులో ఖైదీల ముఠాలు ఒకరినొకరు కొట్టుకున్నారు. జైలు గోడలు బద్దలు కొట్టుకొని వందల మంది ఖైదీలు పారిపోతున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ పోలీస్ యూనియన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
Haiti jail: హైతీ దేశ రాజధాని పోర్ట్ ఆ ప్రిన్స్ (Port-au-Prince) రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్రమైన నేరాలు చేసిన వారిని బంధించే ప్రధాన జైలులో ఖైదీల ముఠాలు ఒకరినొకరు కొట్టుకున్నారు. జైలు గోడలు బద్దలు కొట్టుకొని వందల మంది ఖైదీలు పారిపోతున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ పోలీస్ యూనియన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. రాజధానిలోని అధికారులందరూ తక్షణమే కార్లు, ఆయుధాలు తీసుకొని జైలును అదుపు చేయడానికి రావాలని అభ్యర్థించింది.
అంతేగాక ‘దాడి చేసేవారు పూర్తిగా విజయం సాధిస్తే దాదాపు 3,000 మంది నేరగాళ్లు పట్టణంలోకి వస్తారు. ఎవరినీ వదిలిపెట్టరు’ అని దానిలో పేర్కొంది. కెన్యాతో రక్షణ ఒప్పందం చేసుకోవడానికి హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ ఇటీవల ఆ దేశ పర్యటనకు వెళ్లిన సమయంలో పోర్ట్ ఆ ప్రిన్స్లో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. పోలీస్ స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలుపెట్టారు.
దాంతో అమెరికా విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి. అదే సమయంలో దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్లను ఉంచే పోర్ట్ ఆ ప్రిన్స్ జైలుపై దాడులు మొదలయ్యాయి. ఈ జైల్లో దేశాధ్యక్షుడి హంతకులతోపాటు 18 మంది కొలంబియా నేరగాళ్లు కూడా ఉన్నారు. దీని సామర్థ్యం కేవలం 3,900 కాగా.. ఇప్పుడు అందులో 11,778 మంది ఖైదీలు ఉన్నారు.
ఈ క్రమంలో జైలుపై బయటి నుంచి ఓ ముఠాకు చెందిన దుండగులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బాజ్-5 ముఠా హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. మరోవైపు కెన్యాతో ఒప్పందం అమల్లోకి వస్తే.. ఆ దేశ దళాలు హైతీ రక్షణకు సాయం చేస్తాయి. దీనిపై ఓ నేరగాళ్ల ముఠా నాయకుడు జిమ్మీ చెరిజియర్ అలియాస్ బార్బెక్యూ మాట్లాడుతూ.. ప్రధాని హెన్రీని పదవి నుంచి దించుతామన్నాడు.
‘పోలీసులు, సైన్యమే ప్రధానిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు. కాగా, జిమ్మీ గతంలో పోలీస్ అధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత గ్యాంగులతో సంబంధాలు పెట్టుకొని నేరగాడిగా మారాడు. అతడిపై అమెరికా, ఐరాస ఆంక్షలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

