టొరంటో, జూలై 18: హెచ్1-బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ దేశంలోనూ మూడేండ్లు ఉద్యోగం చేసుకోవచ్చని కెనడా ప్రకటించింది. దీంతోపాటు వీసాదారుల కుటుంబ సభ్యులు ఉద్యోగం, విద్యాభ్యాసం చేసుకొనే అవకాశం కూడా కల్పించింది. ఈ నెల 16 నుంచి ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చని కెనడా ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఆఫర్‌కు భారీ స్పందన లభించడంతో రెండు రోజులకే ఐఆర్సీసీ పోర్టల్‌లో దరఖాస్తుల స్వీకరణను నిలిపేశారు. అదనపు దరఖాస్తులను స్వీకరించమని స్పష్టం చేశారు.