క్రోకర్ ఫిష్.. ఈ చేప చాలా కాస్ట్లీ గురూ..!
Croaker fish costly: క్రోకర్ ఫిష్..! ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా..? కనీసం ఈ చేపను చూడనైనా చూశారా..? లేదు కదా..? కాబట్టి మీరు కచ్చితంగా ఈ ఖరీదైన చేప గురించి తెలుసుకోవాల్సిందే.

బలూచిస్థాన్: క్రోకర్ ఫిష్..! ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా..? కనీసం ఈ చేపను చూడనైనా చూశారా..? లేదు కదా..? కాబట్టి మీరు కచ్చితంగా ఈ ఖరీదైన చేప గురించి తెలుసుకోవాల్సిందే. అయితే ఈ చేప గురించి తెలుసుకునే ముందు ఈ చేప ప్రస్తావన ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకుందాం..! పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ సముద్ర తీరంలో గ్వాదర్ జిల్లాకు చెందిన మత్స్యకారులు అబ్దుల్ హక్, అతడి సహచరులు చేపలు పడుతున్నారు.
ఆ మత్స్యకారులు విరిసిన వలలో చిక్కిన చేపను చూసి వాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఎందుకంటే వాళ్ల వలలో చిక్కింది మామూలు చేప కాదు. లక్షల ఖరీదు చేసే క్రోకర్ చేప. పైగా ఆ చేప బరువు కూడా 48 కిలోలు తూగింది. వెంటనే ఆ చేపను మార్కెట్‌కు తరలించగా రూ.72 లక్షల ధర పలికింది. చూశారుగా.. ఒక్క చేప రాత్రికి రాత్రే ఆ మత్స్యకారులను లక్షాధికారులను చేసింది. అది ఇతర చేపలతో పోల్చుకుంటే క్రోకర్ చేపలో ఉన్న స్పెషాలిటీ. మరో ముఖ్య విషయం ఏందంటే ఈ చేపలు చేసే కుర్ కుర్ శబ్దాల వల్లే వాటికి క్రోకర్ చేపలు అనే పేరు వచ్చిందట.
అయితే, క్రోకర్ చేపకు అంత డిమాండ్ ఎందుకంటే దానిలోని ఎయిర్ బ్లాడర్ వల్లనేనని ప్రముఖ జువాలజిస్టులు చెబుతున్నారు. చేప గాలి నింపుకుని ఈదడానికి ఉపయోపడే ఈ ఎయిర్ బ్లాడర్‌కు వైద్య చికిత్సల్లో కూడా ఎంతో ప్రాధాన్యం ఉన్నదట. చైనా, జపాన్, యూరప్‌లో దానికి చాలా డిమాండ్ ఉందట. శస్త్రచికిత్సల్లో కుట్ల కోసం వినియోగించే దారం క్రోకర్ చేప ఎయిర్ బ్లాడర్ నుంచే తయారు చేస్తారట. ముఖ్యంగా గుండె ఆపరేషన్లలో క్రోకర్ చేప ఎయిర్ బ్లాడర్‌తో తయారు చేసిన దారాన్నే ఉపయోగిస్తారట.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

