ఏథెన్స్: గ్రీస్ దేశంలో ఓ ఉన్మాది కాల్పుల(Greece Shooting)కు పాల్పడ్డాడు. ఏథెన్స్లో ఉన్న సోషల్ సెక్యూర్టీ ఆఫీసుతో పాటు కోర్టులో అతను కాల్పులు జరిపాడు. సాయుధ వ్యక్తి జరిపిన కాల్పుల్లో అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. షూటర్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. అయితే కాల్పులకు తెగించిన వ్యక్తి వయసు 89 ఏళ్లు అని గ్రీక్ మీడియా పేర్కొన్నది. ఆ వ్యక్తి వద్ద షాట్‌గన్ ఉన్నట్లు తెలిపారు. గ్రీసు రాజధాని ఏథెన్స్లో ఉన్న సెక్యూర్టీ ఆఫీసుపై అతను తొలుత అటాక్ చేశాడు. అక్కడో ఉద్యోగి గాయపడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏథెన్స్‌లోనే ఉన్న ఓ కోర్టు బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో కాల్పులు జరిపాడు. అక్కడ పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఎందుకు ఆ వ్యక్తి కాల్పులకు తెగించాడో ఇంకా స్పష్టం కాలేదు.