PM Modi : ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వీడన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి వైమానిక దళం భారీ రక్షణ కల్పించింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం స్వీడన్ గగనతలంలోకి చేరుకోగానే, ఆ దేశంలోని అత్యున్నత రక్షణ విమానాలైన గ్రిపెన్ జెట్స్ ఎస్కార్ట్గా వచ్చాయి. ఈ విమానాలు స్వీడన్ ఫైటర్ జెట్లలో కీలకమైనవి.
మోదీ విమానం స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకునే వరకు ఈ విమానాలు రక్షణగా ఉన్నాయి. ఆదివారం ఆయన స్వీడన్లో అడుగుపెట్టారు. ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఆహ్వానం మేరకు మోదీ స్వీడన్లో పర్యటిస్తున్నారు. మే 17, 18 తేదీల్లో మోదీ ఆ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక సహకారం, వ్యాపారం వాణిజ్యం వంటి పలు అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే, గ్రీన్ ఎనర్జీ, ఏఐ, సరఫరా వ్యవస్థ, రక్షణ, స్టార్టప్స్, స్పేస్ సహకారం, వాతావరణ అంశాలు వంటి వాటిపై చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
#WATCH | Swedish Gripen fighter jets escort PM Narendra Modi’s plane as he enters Sweden
PM Modi is visiting Gothenburg, Sweden, on May 17-18 at the invitation of Swedish Prime Minister Ulf Kristersson. pic.twitter.com/m2Rgoxg3x8
— ANI (@ANI) May 17, 2026
ఇప్పటికే ఇరు దేశాల మధ్య 2025లో 7.75 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ప్రస్తుతం మోదీ ఐదు దేశాల విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యూఏఈలో పర్యటించిన మోదీ.. రెండు రోజులపాటు నెదర్లాండ్స్లో కూడా పర్యటించారు. అక్కడ రెండు దేశాల మధ్య కీలకమైన 17 అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. నెదర్లాండ్స్ నుంచి నేరుగా ప్రధాని.. స్వీడన్ చేరుకున్నారు.