బెర్లిన్ : జర్మనీ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. 30 ఏళ్ల లోపు ఉన్నవారు కేవలం ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాలను మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఆ దేశ అడ్వైజరీ కమిటీ చేసిన ప్రతిపాదనల మేరుకు ఈ ఆదేశాలు జారీ చేసింది. మోడెర్నా వ్యాక్సిన్‌తో పోలిస్తే, ఫైజర్ టీకా వల్ల యువతలో తక్కువ స్థాయిలో గుండె కండరాల్లో వాపు సమస్యలు వస్తున్నట్లు గురించారు. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల లోపు ఉన్నవారు ఫైజర్ టీకా తీసుకోవాలని సూచించారు. గర్భిణులు కూడా కేవలం ఫైజర్ టీకాను మాత్రమే వేయించుకోవాలని సిట్కో కమిటీ పేర్కొన్నది.