Geoffrey Hinton | మానవ మేధకు ఏఐ సవాల్.. ఆ మాయా ప్రపంచంలో నిజం తెలుసుకోవటం కష్టం: జాఫ్రీ హింటన్
భూమిపై ఆధిపత్యం వహిస్తున్న మనిషి మేధకు అతి త్వరలో పెను సవాల్ ఎదురుకాబోతున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రపంచాన్ని ఊపేస్తున్న కృత్రిమ మేధనే (ఏఐ) మునుముందు మానవ మేధపై ఆధిపత్యం వహించే ప్రమాదం ఉన్నదని ఆ కృత్రిమ మేధను సృష్టించిన శాస్త్రవేత్త, గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐగా ప్రసిద్ధి చెందిన జాఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తంచేశారు.
- మనుషులను మించిపోనున్న ఏఐ
- గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ జాఫ్రీ హింటన్
- గూగుల్‌లో ఉద్యోగానికి రాజీనామా
Geoffrey Hinton | న్యూయార్క్, మే 2: భూమిపై ఆధిపత్యం వహిస్తున్న మనిషి మేధకు అతి త్వరలో పెను సవాల్ ఎదురుకాబోతున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రపంచాన్ని ఊపేస్తున్న కృత్రిమ మేధనే (ఏఐ) మునుముందు మానవ మేధపై ఆధిపత్యం వహించే ప్రమాదం ఉన్నదని ఆ కృత్రిమ మేధను సృష్టించిన శాస్త్రవేత్త, గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐగా ప్రసిద్ధి చెందిన జాఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తంచేశారు.
ఏఐ నుంచి భవిష్యత్తులో ఎదురుకానున్న ప్రమాదల గురించి మానవ జాతిని హెచ్చరించేందుకు వారం క్రితమే ఆయన గూగుల్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2012లో టొరంటోలో తన ఇద్దరు శిష్యులతో కలిసి ఆయన ఏఐని సృష్టించారు. ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకరు ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తున్న ‘ఓపెన్ ఏఐ’ ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నారు. ఏఐ విషయంలో గూగుల్ సంస్థ ఎంతో జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నదని ప్రశంసించిన హింటన్, ఈ టెక్నాలజీ వల్ల తలెత్తబోయే దృష్ప్రభావాల గురించి స్వేచ్ఛగా మాట్లాడేందుకే తాను గూగుల్ నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు.
ఏఐ వల్ల ఎన్నో ప్రమాదాలు
ఏఐ త్వరలో అసాధారణంగా అభివృద్ధి చెందుతుందని, దానివల్ల ఎన్నో ప్రమాదాలు కూడా ఉంటాయని హింటన్ న్యూయార్క్‌టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్రస్తుతానికి మనిషికంటే ఏఐ తెలివైందేమీ కాదు. కానీ త్వరలో ఆ స్థాయికి చేరుకొంటుందని భావిస్తున్నా. భవిష్యత్తులో ఏఐ కొట్లాది ఉద్యోగాలను లేకుండా చేస్తుంది. అది సృష్టించే మాయా ప్రపంచంలో నిజమేదో తెలుసుకోవటం కూడా చాలా కష్టం’ అని వివరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

