Fukushima Nuclear Plant: పసిఫిక్ సముద్రంలోకి ఫుకుషిమా రేడియోధార్మిక జలాలు
Fukushima Nuclear Plant: ఫుకుషిమా అణు ప్లాంట్‌లో ట్రీట్ చేసిన రేడియోధార్మిక వ్యర్ధ జలాలను సముద్రంలోకి రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానున్నది. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని కిషిదా ప్రకటించారు.
టోక్యో: ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్(Fukushima Nuclear Plant) నుంచి రేడియోధార్మిక వ్యర్ధాలను జపాన్ రిలీజ్ చేయనున్నది. పసిఫిక్ మహాసముద్రంలోకి గురువారం ఆ జలాలను రిలీజ్ చేస్తారు. 12 ఏళ్ల క్రితం ఆ ప్లాంట్‌లో ఉన్న రియాక్టర్ కరిగిపోయింది. మంగళవారం తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రధాని ఫుమియో కిషిదా ప్రకటించారు. రేడియో ధార్మిక వ్యర్ధ జలాలను సముద్రంలోకి రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని దాని ఆపరేటర్ టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి ఆదేశాలు జారీ చేశారు.
వాతావరణం, సముద్ర పరిస్థితులు అనుకూలిస్తే జలాల విడుదల జరుగుతుందన్నారు. ప్లాంట్ డీకమిషనింగ్ కోసం రేడియోధార్మిక వ్యర్థ జలాల విడుదల అవసరమని కిషిదా తెలిపారు. ప్లాంట్ భద్రత కోసం అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. మత్స్య పరిశ్రమ ప్రతిష్ట దెబ్బతినకుండా చూస్తామన్నారు. డీకమిషనింగ్ ప్రక్రియ కొన్నేళ్ల పాటు సాగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
భారీ భూకంపం, సునామీ వల్ల ఫుకుషిమాలో ఉన్న కూలింగ్ రియాక్టర్లు ధ్వంసం అయ్యాయి. దాంతో ఆ ప్లాంట్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే వ్యర్థ జలాలను సముద్రంలోకి రిలీజ్ చేయవద్దు అని చాన్నాళ్లు ఫిషింగ్ ఇండస్ట్రీలు వ్యతిరేకించాయి.
సుమారు పది లక్షల టన్నుల ట్రీట్మెంట్ చేసిన రేడియోధార్మిక వ్యర్ధ జలాలను సముద్రంలోకి రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ నీరు సురక్షితంగానే ఉన్నట్లు జపాన్ ప్రభుత్వం చెబుతోంది. ఆ నీటి వల్ల ప్రభావం తక్కువే అని, అందుకే అనుమతి ఇస్తున్నట్లు అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

