Emmanuel Macron: సిరియా రాజధానిలో పేలుళ్లు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ సురక్షితం
Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్ ప్రస్తుతం సిరియా పర్యటనలో ఉన్నారు. అయితే ఆయన డమస్కస్‌లోని ఫోర్ సీజన్స్ హోటల్లో బస చేస్తున్నారు. ఆ హోటల్ ముందు ఇవాళ బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకున్నది. మాక్రన్ సురక్షితంగా ఉన్నట్లు ఫ్రాన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
డమస్కస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్(Emmanuel Macron) ప్రస్తుతం సిరియా పర్యటనలో ఉన్నారు. అయితే ఆయన డమస్కస్‌లోని ఫోర్ సీజన్స్ హోటల్లో బస చేస్తున్నారు. ఆ హోటల్ ముందు ఇవాళ బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకున్నది. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాను కలిసేందుకు అధ్యక్ష కార్యాలయంలోకి మాక్రన్ వెళ్లిన తర్వాత ఆయన బస చేస్తున్న హోటల్ వద్ద పేలుడు ఘటన జరిగడం శోచనీయం. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. దాంట్లో నలుగురు పోలీసులు కూడా ఉన్నాయి. రెండు దేశాల మధ్య చర్చలు చేపట్టేందుకు మాక్రన్ పలు దేశాల్లో పర్యటిస్తున్నారు.
సోమవారం సిరియా చేరుకున్న ఆయన.. ఆ తర్వాత టర్కీలో జరిగే నాటో సమావేశాలకు వెళ్లనున్నారు. ఫోర్ సీజన్స్ హోటల్ ముందు రెండు ప్రదేశాల్లో పేలుళ్ల ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ పర్యటనలో ఎటువంటి మార్పు ఉండబోదని ఎలిసిస్ ప్యాలెస్ తన ప్రకటనలో పేర్కొన్నది. ఫోర్ సీజన్స్ హోటల్ వద్ద జరిగిన పేలుళ్లకు చెందిన వీడియోలు, ఇమేజ్‌లు వైరల్ అవుతున్నాయి. భారీ స్థాయిలో మంటలు, సొగ కమ్ముకున్నది.
సిరియా ప్రెసిడెంట్ అల్ షరా .. మాక్రన్‌కు స్వాగతం పలికారు. పేలుళ్లు జరిగిన సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోటల్లో లేరని తెలిసింది. బాషర్ అల్ అసద్ పాలన ముగిసిన తర్వాత యూరోప్ దేశ ప్రతినిధి సిరియాకు వెళ్లడం ఇదే తొలిసారి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
KTR | ‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్ ప్రశంసల వర్షం.. చాలా కాలం తర్వాత ఇంత మంచి సినిమా చూశానంటూ కామెంట్స్!
Layoffs | భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మరో టెక్ దిగ్గజం.. SAPలో 10 వేల ఉద్యోగాలకు కోత?
Akhil | భార్యతో కలిసి జపాన్ చెక్కేసిన అఖిల్ అక్కినేని.. రెండు వారాల ట్రిప్ వెనుక అసలు కారణం ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

