ఆఫ్రికా దక్షిణ దేశాల నుంచి వచ్చే విమానాలపై ఫ్రాన్స్ 48 గంటల నిషేధం..!
Olivier Veran: ఆఫ్రికా దక్షిణ దేశాల్లో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి యూరప్ దేశాల్లో కలవరం పుట్టిస్తున్నది. అందుకే ఆ దేశాలు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాలు

పారిస్: ఆఫ్రికా దక్షిణ దేశాల్లో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి యూరప్ దేశాల్లో కలవరం పుట్టిస్తున్నది. అందుకే ఆ దేశాలు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాలు ఆఫ్రికా దక్షిణ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించగా.. తాజాగా ఫ్రాన్స్ ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలపై 48 గంటలపాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి ఒలీవియర్ వెరాన్ శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ఆఫ్రికాలోని దక్షిణ దేశాల్లో కొత్త వేరియంట్ విస్తృతి కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
అయితే, యూరప్ దేశాల్లో ఇంతవరకు ఎక్కడా కొత్త వేరియంట్ జాడలు కనిపించలేదని వెరాన్ పేర్కొన్నారు. కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచి ఇటీవల వచ్చిన అందరినీ క్వారెంటైన్లో ఉంచి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తామని, అందరి ఆరోగ్య పరిస్థితిని చాలా దగ్గరి నుంచి పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు. ఇదిలావుంటే ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టెక్స్ కూడా కొత్త రకం కరోనా వేరియంట్ గురించి ప్రత్యేక ప్రకటన చేశారు. న్యూ వేరియంట్‌పై యూరప్‌లోకి రాకుండా ఎలా నిలువరించాలనే దానిపై ఈయూ నేతలతో చర్చిస్తామని ఆయన చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

