Mike Pence | అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్
వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత మైక్ పెన్స్ (Mike Pence) ప్రకటించారు. అనేక చర్చల తనంతరం ప్రెసిడెంట్ రేసు (Presidential Campaign) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాని చెప్పారు.
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత మైక్ పెన్స్ (Mike Pence) ప్రకటించారు. అనేక చర్చల తనంతరం ప్రెసిడెంట్ రేసు (Presidential Campaign) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాని చెప్పారు. లాస్‌వెగాస్‌లో జరిగిన రిపబ్లికన్ యూదు కూటమి వార్షిక సదస్సులో ఈమేరకు తెలిపారు. తన ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. రిపబ్లికన్ నేతలకు మద్దతుగా ఉంటానని, వారి విజయం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. అయితే ఆర్థిక సవాళ్లు, పోల్ సంఖ్యలో వెనుకబడి ఉండటంతో పెన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ నామిషనేషన్ కోసం డొనాల్డ్ ట్రంప్, పెన్స్తోపాటు భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి పోటీపడుతున్నారు. ఇప్పుడు పోటీ నుంచి పెన్స్ తప్పుకోవడం విశేషం. కాగా, పెన్స్.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతకుముందు ఇండియానా గవర్నర్‌గా, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా పనిచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

