e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News హాస్పిట‌ల్ నుంచి బిల్ క్లింట‌న్ డిశ్చార్జ్‌..

హాస్పిట‌ల్ నుంచి బిల్ క్లింట‌న్ డిశ్చార్జ్‌..

లాస్ ఏంజిల్స్‌: అమెరికా మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్‌.. ఆదివారం హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం ఆయ‌న్ను ద‌క్షిణ కాలిఫోర్నియాలోని హాస్పిట‌ల్‌లో చేర్పించారు. మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్ష‌న్‌తో బిల్ క్లింట‌న్ బాధ‌ప‌డుతున్నారు. హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన క్లింట‌న్‌.. బొట‌న‌వేలుతో థంప్స‌ప్ సంకేతం ఇచ్చారు. ఇక నుంచి న్యూయార్క్ లో ఆయ‌న ట్రీట్మెంట్ తీసుకోనున్నారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇర్విన్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో క్లింట‌న్ చికిత్స పొందారు. డాక్ట‌ర్ అల్పేశ్ అమిన్ ఆయ‌న‌కు చికిత్స‌నందించారు. బిల్‌కు జ్వ‌రం త‌గ్గింద‌ని, ఆయ‌న తెలుపు ర‌క్త క‌ణాలు కూడా నార్మ‌ల్ రేంజ్‌కు వ‌చ్చిన‌ట్లు డాక్ట‌ర్ అల్పేశ్ తెలిపారు. ఇక ఇంట్లోనే ఆయ‌న యాంటీబ‌యాటిక్స్ కోర్సును కొన‌సాగించ‌నున్నారు. 1993 నుంచి 2001 వ‌ర‌కు అమెరికా అధ్య‌క్షుడిగా బిల్ క్లింట‌న్ చేశారు. 2004లో ఆయ‌న‌కు బైపాస్ స‌ర్జ‌రీ జ‌రిగింది. 2010లోనూ హార్ట్ ఆప‌రేష‌న్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement