Telegraph Message : ఆ మెసేజ్ అందడానికి 18 గంటలు పట్టింది..!
Telegraph Message : బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త సామ్యూల్ మోర్స్ టెలిగ్రాఫ్‌ను కనిపెట్టాడు. దీని ద్వారా పంపే అక్షరాకు మోర్స్ కోడ్ అని పేరు పెట్టారు. ఈ యంత్రాన్ని ఉపయోగించి 1858 లో సరిగ్గా ఇదే రోజున ...

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సమాచారాన్ని చేరవేసేందుకు బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త సామ్యూల్ మోర్స్ టెలిగ్రాఫ్‌ను కనిపెట్టాడు. దీని ద్వారా పంపే అక్షరాకు మోర్స్ కోడ్ అని పేరు పెట్టారు. ఈ యంత్రాన్ని ఉపయోగించి 1858 లో సరిగ్గా ఇదే రోజున లండన్ నుంచి బ్రిటీష్ మహారాణి, అమెరికా అధ్యక్షుడికి తొలి సమాచారాన్ని (Telegraph Message) పంపారు. ఈ సమాచారం దాదాపు 18 గంటల తర్వాత అమెరికా అధ్యక్షుడికి చేరింది. సమాధానంగా అమెరికా అధ్యక్షుడు, బ్రిటీష్ మహారాణికి పంపిన సమాచారం 10 గంటల తర్వాత చేరింది. ఇక అప్పటి నుంచి టెలిగ్రాఫ్ మెసేజ్‌లు పంపుకోవడం ప్రారంభమైంది.
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ కారణంగా ప్రపంచంలోని ఏ మూల నుంచైనా సమాచారాన్ని చేరవేసుకునే అవకాశం ఉన్నది. అదే కొన్ని దశాబ్దాల క్రితం సమాచారం చేరవేత అంత సులువుగా ఉండేది కాదు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని సామ్యూల్ మోర్స్ అనే శాస్త్రవేత్త టెలిగ్రాఫ్ మిషన్‌ను కనిపెట్టి దాని ద్వారా సమాచారం చేరవేసుకునే అవకాశం కల్పించాడు. తొలి సమాచారాన్ని బ్రిటీష్ రాణి విక్టోరియా నుంచి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ బుచానన్‌కు పంపారు. 99 పదాలున్న ఈ సమాచారం లండన్ నుంచి అమెరికాకు చేరేందుకు దాదాపు 18 గంటల సమయం పట్టింది. తిరుగు సమాధానంగా జేమ్స్ బుచానన్, విక్టోరియా మహారాణికి పంపిన 143 పదాల సమాచారం 10 గంటల తర్వాత ముట్టింది. ఇదే సందేశం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా చేరవేసిన తొలి అధికారిక టెలిగ్రాఫ్ సందేశంగా నిలిచింది.
ఫారడే కనిపెట్టిన ఎలక్ట్రోమ్యాగ్నెట్ను విపులంగా చదివి ఆకలింపు చేసుకున్న సామ్యూల్ మోర్స్, దీని ద్వారా సమాచారం చేరవేసేందుకు గల అవకాశాలపై అధ్యయనం చేశారు. ఆంగ్లంలోని అక్షరాలకు బదులుగా చిన్న గీతలు, చుక్కల ఆధారంగా సమాచారం పంపించేలా పరికరాన్ని సిద్ధం చేశారు. ఈ పరికరానికి 1840 లో సామ్యూల్ మోర్స్ పెటెంట్ పొందారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2018 : భారతదేశం మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి మరణం
2018 : కేరళలో వరదల కారణంగా 106 మంది మృతి, నిరాశ్రయులుగా మారిన లక్షన్నర మంది
2010 : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు రాజకీయ ఆశ్రయం మంజూరు చేసిన ఈక్వెడార్
2008 : ఒలింపిక్స్ 100 మీటర్ల పరుగును 9.69 సెకండ్లలో పూర్తిచేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్
1997 : ప్రముఖ గాయకుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్ మరణం
1930 : రంగుల్లో తొలి కార్టూన్ సినిమా ‘ఫిడ్డిల్స్టిక్స్’ విడుదల
1904 : ప్రముఖ హిందీ కవి సుభ్ర కుమారి చౌహాన్ జననం
ఇవి కూడా చదవండి..
సోషల్ మీడియాలో జాతీయ గీతం కొత్త రికార్డు.. అదేంటంటే..?
ముంబై ఇండియన్స్‌కు వెరైటీగా అనౌన్స్మెంట్
ధోనీతోనే రిటైర్ ఎందుకు అయ్యానంటే..? : సురేశ్ రైనా
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

