Joe Biden | అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇంటిపై చెక్కర్లు కొట్టిన విమానం.. తరిమేసిన ఫైటర్ జెట్లు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) నివాసంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ విమానాన్ని (Civilian aircraft) యూఎస్ ఫైటర్ జెట్లు తరిమికొట్టాయి. డెలావేర్లోని (Delaware) విల్మింగ్టన్లో ఉన్న బైడెన్ నివాసంపై ఓ పౌర విమానం తిరుగుతున్నది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) నివాసంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ విమానాన్ని (Civilian aircraft) యూఎస్ ఫైటర్ జెట్లు తరిమికొట్టాయి. డెలావేర్లోని (Delaware) విల్మింగ్టన్లో ఉన్న బైడెన్ నివాసంపై ఓ పౌర విమానం తిరుగుతున్నది. అది నోఫ్లయింగ్ జోన్ కావడంతో.. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత గగణ తలంలో (Restricted airspace) చక్కర్లు కొడుతున్న విమానాన్ని వాయుసేన గుర్తించింది. ఆ సమయంలో బైడెన్ అక్కడం ఉండటంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైటర్ జట్లు (US fighter jets) ఆ విమానాన్ని అక్కడి నుంచి తరిమికొట్టాయి. దీనివల్ల అధ్యక్షుడికి ఎలాంటి అసౌకర్యం కలుగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 2 గంటలకు (స్థానిక కాలమానం) చోటుచేసుకున్నదని వెల్లడించారు.
కాగా, ఆ విమానం సమీపంలోని ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయిందని చెప్పారు. అసలు నిషేధిత ప్రాంతంలోకి ఆ విమానం ఎందుకు వచ్చిందనే విషయమై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు.

Us 1
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

