Ferrari | రికార్డు ధర పలికిన 1962 ఫెరారీ కారు..! ధరెంతో తెలిస్తే గుండె గుబేల్ మంటది..!
Ferrari | ఫెరారీ జీటీఓ 1962 మోడల్ వేలంలో రికార్డు ధరకు అమ్ముడైంది. ఇటీవల నిర్వహించిన వేలంలో 51.7 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.430 కోట్లకుపైగా) ధర పలికింది. దీంతో గతంలో ఫెరారీ నమోదు చేసిన రికార్డులన్నింటి.. జీటీవో మోడల్ బద్దలు కొట్టింది.
Ferrari | ఫెరారీ జీటీఓ 1962 మోడల్ వేలంలో రికార్డు ధరకు అమ్ముడైంది. ఇటీవల నిర్వహించిన వేలంలో 51.7 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.430 కోట్లకుపైగా) ధర పలికింది. దీంతో గతంలో ఫెరారీ నమోదు చేసిన రికార్డులన్నింటి.. జీటీవో మోడల్ బద్దలు కొట్టింది. ఇటాలియన్ కోచ్మేకర్ స్కాగ్లియెట్టి 1962 ఫెరారీ 330 ఎల్ఎం/250 జీటీవోను ఈ నెల 13న న్యూయార్క్ నగరంలోని ఆర్ఎం సోథెబైస్ వేలానికి పెట్టారు. 34వేల మిలియన్ల వద్ద వేలం మొదలవగా.. కార్యక్రమం 20 నిమిషాల్లోనే ముగిసింది. చివరి బిడ్ 47 మిలియన్లకు రాగా.. 10శాతం కొనుగోలుదారుల ప్రీమియంతో 51.7 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫెరారీ కారుగా రికార్డు నెలకొల్పింది.
ఇది 1962 ఫెరారీ 250 జీటీవో మోడల్. అయితే, 60 సంవత్సరాల కిందటి ఫెరారీ 250 జీటీవో మోడల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా మారుతుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. వేలంలో మంచి ధరనే పలుకుతుందని భావించినా.. అందరి అంచనాలను మించి రికార్డు ధర పలికింది. ఇంతకు ముందు మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే మోడల్ అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. ఈ మోడల్ వేలంలో 143 మిలియన్ డాలర్లకు (రూ.1000 కోట్లకుపైగా) విక్రయించగా.. ఫెరారీ 250 జీటీవో మోడల్ ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన మోడల్‌గా కారుగా నిలిచింది. ఫెరారీ 250 జీటీఓ కారు 4.0 లీటర్ వీ12 ఇంజిన్‌ను కలిగి ఉండగా.. కారులో ఛాసిస్ 3765 ఉంది.
390 బీహెచ్పీ పవర్‌ని ఉత్పత్తి చేసే ఫోర్ లీటర్ 2,953 సీసీ వీ-12 ఇంజిన్‌ను కలిగి ఉంది. 5 స్పీడ్ డాగ్ లెగ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ కారు కేవలం 6.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ఠంగా గంటకు 280 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఇదిలా ఉండగా.. రికార్డు ధరకు అమ్ముడుపోయిన కారును ఎవరు కొనుగోలు చేశారన్నది తెలియరాలేదు. అయితే ఈ ప్రత్యేక యూనిట్ గతంలో నాలుగు దశాబ్దాలకుపైగా ఒహియోకు చెందిన కలెక్టర్ జిమ్ జైగర్ యాజమాన్యంలో ఉంది. ఈ కారుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. స్కుడెరియా ఫెరారీ రేసులో పాల్గొన్న ఏకైక ఫ్యాక్టరీ మోడల్ ఇదే. ఫ్లోరిడాలోని అమేలియా ఐలాండ్ కాంకోర్స్ డీ ఎలిగాన్స్‌లో బెస్ట్ ఇన్షోను గెలుచుకున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

