New Study | ఆడపిల్ల తండ్రికి దీర్ఘాయుష్షు.. 74 వారాలు పెరుగనున్న లైఫ్‌టైమ్.. పోలండ్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
New Study | ఆడపిల్ల పుట్టిందంటే అయ్యకు ఆయువు సగం కుంగిందన్నమాటే.. ఇది పాత సామెత. కానీ ఆడపిల్ల ఉన్న ఇంట్లో తండ్రి ఆయువు పెరుగుతున్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవిస్తారని పోలండ్‌లోని జాగిలోనియన్ యూనివర్సిటీ సర్వేలో తేలింది. తండ్రుల జీవితకాలాన్ని ప్రతి కుమార్తె సుమారు 74 వారాలపాటు (ఆరేండ్లకుపైగా) పెంచుతుందని పేర్కొన్నది. ఆడపిల్లలు ఉన్న తండ్రులు వారు లేనివారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారని తేలిపింది.
- కుమార్తెలతో తండ్రుల జీవితకాలం వృద్ధి
- 74 వారాలు పెరుగనున్న లైఫ్‌టైమ్
- పోలండ్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
క్రకోవ్, అక్టోబర్ 10: ఆడపిల్ల పుట్టిందంటే అయ్యకు ఆయువు సగం కుంగిందన్నమాటే.. ఇది పాత సామెత. కానీ ఆడపిల్ల ఉన్న ఇంట్లో తండ్రి ఆయువు పెరుగుతున్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవిస్తారని పోలండ్‌లోని జాగిలోనియన్ యూనివర్సిటీ సర్వేలో తేలింది. తండ్రుల జీవితకాలాన్ని ప్రతి కుమార్తె సుమారు 74 వారాలపాటు (ఆరేండ్లకుపైగా) పెంచుతుందని పేర్కొన్నది. ఆడపిల్లలు ఉన్న తండ్రులు వారు లేనివారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారని తేలిపింది.
కొడుకులతో ఎలాంటి ప్రభావం లేదు
2,147 మంది తల్లులు, 2,163 మంది తండ్రులపై విశ్లేషించిన డాటా ఆధారంగా పరిశోధకులు వివరాలను వెల్లడించారు. ఇంట్లో కూతురు ఉంటే తండ్రి ఆయుష్షుపై సానుకూల ప్రభావం పడుతుందని గుర్తించారు. కొడుకులు ఉన్న తండ్రులను, కూతుళ్లు ఉన్న తండ్రుల మధ్య జీవితకాల వ్యత్యాన్ని స్పష్టంగా గుర్తించినట్టు తెలిపారు. కొడుకుల సంఖ్య తండ్రుల జీవితకాలంపై ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. అదే ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నట్టు వెల్లడైందని తెలిపారు.
తల్లులపై ప్రతికూల ప్రభావం!
అమెరికన్ జర్నల్ ఆఫ్ హుమన్ బయాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కుమార్తెలు, కుమారులు ఇద్దరూ తల్లి ఆరోగ్యంపై హానికర ప్రభావాన్ని చూపుతున్నారని, ఆమె జీవితకాలాన్ని తగ్గిస్తున్నట్టు అధ్యయనంలో తేలింది. ఒంటరి మహిళల జీవితకాలం ఇటీవల పెరగడమే ఇందుకు నిదర్శనమని అధ్యయనంలో వెల్లడైంది.
భిన్నంగా మరో సర్వే
మరో సర్వే ప్రకారం పిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. ఆడ, మగ ఎవరున్నా సరే తల్లిదండ్రుల జీవితకాలం పెరుగడానికి దోహదపడతారని వెల్లడైంది. పిల్లలు లేని వారితో పోల్చితే ఎక్కువ కాలం, సుదీర్ఘంగా, సంతోషంగా జీవించే అవకాశం అధికంగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- daughters
- Fathers
- live longer
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

