Jeorge Floyd | జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసు.. మరో పోలీస్ అధికారికి మూడున్నర ఏళ్ల జైలు శిక్ష
2020 మార్చి 25న జార్జ్ ఫ్లాయిడ్ మిన్నెసొటా పోలీసుల చేతిలో హత్యకు గురయ్యాడు.
Jeorge Floyd : రెండేళ్ల క్రితం అమెరికాలోని మిన్నెసొటాలో పోలీసుల చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందిడుతుడు మిన్నెసొటా పోలీస్ అధికారి డెరెక్ చావిన్‌కు ఇప్పటికే 21 ఏళ్ల జైలు శిక్ష పడింది. తాజాగా అతనికి సహకరించిన మిన్నియపోలిస్ మాజీ పోలీసు అధికారి అలెగ్జాండర్ కుయెంగ్కు మూడున్నర ఏళ్ల జైలు శిక్ష పడింది. హెన్నెపిన్ కౌంటీ కోర్టు శుక్రవారం అతనికి జైలు శిక్ష విధించింది. జార్జి ఫ్లాయిడ్ హత్యానంతరం ప్రజాగ్రహం పెల్లుబికడంతో డెరెక్ చావిన్, అలెగ్జాండర్లను విధుల నుంచి తప్పించారు. అక్టోబర్ నెలలో అలెగ్జాండర్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దాంతో, కోర్టు అతనికి జైలు శిక్ష ఖరారు చేసింది.
2020 మార్చి 25వ తేదీన జార్జ్ ఫ్లాయిడ్ మిన్నెసొటా పోలీసుల చేతిలో హత్యకు గురయ్యాడు. డెరెక్, అలెగ్జాండర్ కలిసి ఫ్లాయిడ్‌ను కింద పడేశారు. ఫ్లాయిడ్ మెడపై డెరెన్ తన మోకాలు పెట్టి గట్టిగా 9 నిమిషాల పాటు నొక్కాడు. దాంతో ఊపిరాడక అతను చనిపోయాడు. ఈ సంఘటన తెలిసిన వెంటనే నల్లజాతీయులు బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ పేరుతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా పోలీస్ వ్యవస్థను తప్పుపడుతూ, జాత్యహంకార ధోరణిని నిరసిస్తూ ధర్నాలు చేశారు. సోషల్‌మీడియాలోనూ బ్లాక్‌లైవ్స్ మ్యాటర్ హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

