Yoon Suk Yeol | కోర్టులకు హాజరైన మాజీ దక్షిణ కొరియా అధ్యక్షుడు.. మార్షల్ లా నిర్ణయాన్ని సమర్థించిన నేత..!
Yoon Suk Yeol | అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యెల్ గురువారం కోర్టుల్లో విచారణకు హాజరయ్యారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడంపై విచారణ జరుగుతోంది. అయితే, ఆయన అభిశంసనపై కోర్టులో సవాల్ చేశారు. ఈ రెండు కేసుల్లో వేర్వేరు కోర్టుల్లో విచారణ జరుగుతున్నది.
Yoon Suk Yeol | అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యెల్ గురువారం కోర్టుల్లో విచారణకు హాజరయ్యారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడంపై విచారణ జరుగుతోంది. అయితే, ఆయన అభిశంసనపై కోర్టులో సవాల్ చేశారు. ఈ రెండు కేసుల్లో వేర్వేరు కోర్టుల్లో విచారణ జరుగుతున్నది. యూన్ సుక్-యెల్‌ను గట్టి భద్రత మధ్య సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపరిచారు. గత సంవత్సరం డిసెంబర్లో యున్ సుక్ యోల్ మార్షల్ లా విధించిన విషయం తెలిసిందే. దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ దేశంలో మార్షల్ లా విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలతో పాటు ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత నేపథ్యంలో ప్రభుత్వం కొద్దిగంటల్లోనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
ఉత్తర కొరియా, దేశ వ్యతిరేక శక్తుల నుంచి ప్రమాదం ఉందని యున్ సుక్ యోల్ పేర్కొన్నారు. అధ్యక్షుడి వాదనలను ప్రతిపక్షాలతో పాటు ప్రజలు తోసిపుచ్చారు. మర్షల్ లా విధించిన కొద్దిగంటల్లోనే దక్షిణ కొరియా పార్లమెంట్ ఎదుట వేలాది మంది చేరుకొని మార్షల్‌లాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో అధ్యక్షుడు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. యూన్ సుక్ యోల్ సొంత పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం నిర్ణయాన్ని తప్పుపట్టాయి. మార్షల్ లా కారణంగా దేశ పాలన సైన్యం చేతుల్లోకి వెళ్తుంది. యూన్‌తో పాటు దక్షిణ కొరియా నిఘా సంస్థ మాజీ డిప్యూటీ డైరెక్టర్ హాంగ్ జోగ్ వోన్ సైతం కోర్టుకు హాజరయ్యారు. మార్షల్ లా అమలు, ఉపసంహరణ తర్వాత డిసెంబర్ 14న దక్షిణ కొరియా పార్లమెంట్లో అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. గత నెలలో యెల్‌ను అరెస్టు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సంక్రాంతికి ముస్తాబు
నేడు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

