Sam Altman | మానవాళి మేలు కోసం.. సంపదలో అత్యధిక భాగం దాతృత్వానికే
మానవాళి మేలు కోసం తమ సంపదను త్యాగం చేసే బిలియనీర్ల జాబితాలో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చేరారు. తమ సంపదలో అత్యధిక భాగం దాతృత్వానికి అందజేయనున్నట్టు ప్రకటించారు.
- ఓపెన్ ఏఐ సీఈఓ ఆల్ట్‌మన్
Sam Altman | వాషింగ్టన్: మానవాళి మేలు కోసం తమ సంపదను త్యాగం చేసే బిలియనీర్ల జాబితాలో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చేరారు. తమ సంపదలో అత్యధిక భాగం దాతృత్వానికి అందజేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయనతోపాటు ఆయన భాగస్వామి ఓలివర్ ముల్హెరిన్ ‘ది గివింగ్ ప్లెడ్జ్’ దాతృత్వ కార్యక్రమంపై సంతకం చేశారు. ఈ ప్రపంచం అభివృద్ధి చెందడం కోసం అనేక మంది ఎంతో శ్రమిస్తున్నారని, విజ్ఞానం, దాతృత్వం, అంకిత భావాలతో కృషి చేస్తున్నారని, వారు ఏర్పాటు చేసిన వేదిక తాము ఈ స్థాయికి చేరడానికి అవకాశం కల్పించిందని వీరిద్దరూ లేఖలో పేర్కొన్నట్లు ఈ చారిటీ సంస్థ తెలిపింది.
‘ది గివింగ్ ప్లెడ్జ్’ చారిటీ సంస్థను వారన్ బఫెట్, బిల్ గేట్స్, మెలిందా గేట్స్ 2010లో ప్రారంభించారు. ప్రపంచంలోని సంపన్నులు దానం చేసేలా ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 30 దేశాలకు చెందిన 240 మంది సంపన్నులు భారీగా విరాళం ఇస్తామని ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

