Imran Khan: 8 గంటల పాటు ఆపరేషన్.. అయినా ఇమ్రాన్‌ను అరెస్టు చేయలేకపోయారు
Imran khan:లాహోర్‌లో ఉన్న ఇమ్రాన్ ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. మంగళవారం జరిగిన అరెస్టు ఆపరేషన్ సక్సెస్ కాలేదు. పీటీఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో.. పోలీసులు వెనక్కి తగ్గారు.
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) అరెస్టు కోసం జరిగిన ఆపరేషన్ విఫలమైంది. లాహోర్‌లో ఆయన్ను నిర్బంధించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పీటీఐ(PTI) కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నది. తోషాఖానా (Toshakhana)కేసులో ఇమ్రాన్ అరెస్టు వారెంట్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు మంగళవారం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ మద్దతుదారులు పోలీసుల్ని అడ్డుకున్నారు. టియర్ గ్యాస్(Tear Gas)ను ప్రయోగించారు. ఓ దశలో కాల్పులు కూడా జరిగాయి. అయినా ఇమ్రాన్ ఇంట్లోకి పోలీసులు వెళ్లలేకపోయారు.
My message to the nation to stand resolute and fight for Haqeeqi Azadi & rule of law. pic.twitter.com/bgVuOjsmHG
— Imran Khan (@ImranKhanPTI) March 14, 2023
తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అకస్మాత్తుగా తనను అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చినట్లు ఇమ్రాన్ బీబీసీ(BBC)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తనను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నట్లు న్యూస్‌లో చూశామని ఆయన చెప్పారు. అయినా తాను అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జైలు(jail) జీవితం గడిపేందుకు తాను మెంటల్‌గా ప్రిపేరయ్యానని, ఎన్నాళ్లు జైలులో ఉంటానో తెలియదన్నారు. మార్చి 18వ తేదీ వరకు తాను ముందస్తు బెయిల్(Protective bail) తీసుకున్నానని, కానీ 14వ తేదీన తనను ఎందుకు అరెస్టు చేయాలనుకున్నారో తెలియదన్నారు.
PTI Chairman @ImranKhanPTI’s interview to BBC World News: #Fascist_PDM pic.twitter.com/xrLrtIDYGZ
— PTI (@PTIofficial) March 14, 2023
ఇమ్రాన్ అరెస్టు కోసం సాగిన ఆపరేషన్‌లో 33 మంది పోలీసులు గాయపడ్డారు. ప్రస్తుతం లాహోర్‌లోని జమన్ పార్క్ వద్ద భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. పోలీసులు తనను అరెస్టు చేసేందుకు మళ్లీ తన ఇంటికి రానున్నట్లు ఆయన తాజా వీడియోలో ఆరోపించారు. తనను జైలులో వేయడం లండన్ ప్లాన్ అన్నారు. ఎత్తుకువెళ్లి చంపేయాలని ప్రభుత్వం ప్లాన్ వేసినట్లు చెప్పారు.
اپنی قوم کے لئے میرا پیغام!pic.twitter.com/Dv3i9X0S1J
— Imran Khan (@ImranKhanPTI) March 14, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

