Elon Musk | అవును నేను డ్రగ్స్ తీసుకున్నా.. టెస్లా నిర్వహణకు ఇది ఎంతగానో ఉపయోగపడింది : ఎలాన్ మస్క్
Elon Musk | తరచూ డ్రగ్స్ (Durgs) తీసుకుంటున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలపై అమెరికన్ టైకూన్, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి స్పందించారు. మాదకద్రవ్యాలను వినియోగించినట్లు తాజాగా అంగీకరించారు.
Elon Musk | తరచూ డ్రగ్స్ (Durgs) తీసుకుంటున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలపై అమెరికన్ టైకూన్, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి స్పందించారు. మాదకద్రవ్యాలను వినియోగించినట్లు తాజాగా అంగీకరించారు. డిప్రెషన్ వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్యుడి సూచనల మేరకు కెటమిన్ (ketamine ) అనే డ్రగ్‌ను తీసుకున్నట్లు తెలిపారు. టెస్లా కంపెనీ నిర్వహణలో డ్రగ్స్ వినియోగం తనకు ఉపయోగపడిందని ఆయన వెల్లడించారు (It Helps Him In Running Tesla).
గతంలో ఓ సారి మానసిక కంగుబాటుకు గురైనట్లు మస్క్ చెప్పారు. ఆ సమయంలో దాన్నుంచి బయటపడేందుకు కెటమిన్ తనకు చాలా ఉపయోగపడిందన్నారు. వైద్యుడి సూచన మేరకు వారానికి ఒకసారి చిన్న మొత్తంలో దాన్ని తీసుకునేవాడినని వెల్లడించారు. ‘రోజుకు 16 గంటలు పనిచేస్తుంటాను. దాంతో నాపై తీవ్ర ఒత్తిడి ఉండేది. నేను ఎక్కువ కాలం మానసిక కుంగుబాటులో ఉంటే టెస్లా పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దాన్ని అధిగమించేందుకు కెటమిన్ తీసుకున్నా’ అని వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా కెటమిన్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏ పనీ సక్రమంగా పూర్తి చేయలేరని మస్క్ తెలిపారు.
కాగా, తాను డ్రగ్స్ తీసుకున్నట్లు మస్క్ అంగీకరించడం ఇది రెండోసారి. గతంలో కూడా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. రోగన్‌తో కలిసి గతంలో ఓసారి డ్రగ్స్ సేవించిన విషయం నిజమేనని అప్పట్లోనే చెప్పారు. ఆ తర్వాత తాను డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. నాసా అభ్యర్థనతో టెస్లా ఆఫీసును డ్రగ్స్ రహితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ అభ్యర్థన మేరకు గత మూడేళ్లుగా తాను వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటున్నట్లు తెలిపారు. అయితే, ఈ మూడేళ్లలో తన శరీరంలో డ్రగ్స్ కానీ, మద్యానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లూ గుర్తించలేదని మస్క్ వివరించారు.
మస్క్ తరచూ నిషేధిత డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో జరిగే పార్టీల్లో మస్క్ పాల్గొంటూ.. అక్కడ డ్రగ్స్‌ను తీసుకుంటున్నారని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. దీని వల్ల మస్క్ ఆరోగ్యంతోపాటు ఆయన వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతున్నదని ఆ సంస్థల డైరెక్టర్ల బోర్డు సభ్యులు ఆందోళన చెందుతున్నట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక వెల్లడించింది.
Also Read..
Indian Air Force | బాపట్లలో జాతీయ రహదారిపై సుఖోయ్ యుద్ధ విమానాల ల్యాండింగ్.. VIDEOS
Couple Thrashed | షాకింగ్.. ఇంటి ముందు కారు పార్క్ చేశారని దంపతులపై దాడి.. VIDEO
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

