Netflix CEO | ఎలన్ మస్క్ ధైర్యవంతుడు..ఈ నేలపై క్రియేటివ్‌గా ఆలోచించేది అతనొక్కడే : నెట్‌ఫ్లిక్స్ సీఈఓ
మస్క్ తన విజయాలతో ప్రపంచానికి సాయపడాలి అనుకుంటున్నాడు
Netflix CEO : మైక్రోబ్లాంగింగ్ సంస్థ ట్విట్టర్‌ను కొనుగోలు తర్వాత ఉద్యోగులపై వేటు, బ్లూటిక్ వెరిఫికేషన్ వంటి నిర్ణయాలు తీసుకున్న ఎలన్ మస్క్‌ను చాలామంది విమర్శించారు. అయితే, మరికొందరు అతడికి మద్దతు పలికారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ సీఈఓ రీడ్ హేస్టింగ్స్ అమెరికాలో మస్క్‌పై ప్రశంసలు కురిపించాడు. న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ సదస్సుకు హాజరైన హేస్టింగ్స్ మాట్లాడుతూ… ‘మస్క్ ధైర్యవంతుడు. ఈ నేలపై క్రియేటివ్‌గా ఆలోచించే వ్యక్తి అతనొక్కడే. వివిధ రంగాల్లో అతను సాధించిన అద్భుతాలే అందుకు నిదర్శనం. అతను వంద శాతం ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. తన విజయాలతో ప్రపంచానికి సాయపడాలి అనుకుంటున్నాడు’ అంటూ మస్క్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.
అంతేకాదు ఒక బాస్‌గా తనకు, మస్క్‌కు ఉన్న తేడాను కూడా వెల్లడించాడు. నేను నిదానంగా, గౌరవప్రదమైన నాయకుడిగా ఉండాలనుకుంటాను. కానీ, మస్క్ అవేం పట్టించుకోడు. తనకు నచ్చినట్టు ఉంటాడు. అతనిలాగ నేను పని చేయలేను. అతడంటే నాకు చాలా గౌరవం అని హేస్టింగ్స్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ట్విట్టర్లో మార్పులు తెస్తున్న మస్క్‌ను విమర్శించడం సరికాదని అన్నాడు. తనపై ప్రశంసలతో ముంచెత్తిన హేస్టింగ్స్‌కు ‘వావ్.. మీరు చెప్పిన విషయాలకు థ్యాంక్యూ’ అంటూ మస్క్ ట్వీట్ ద్వారా థ్యాంక్యూ చెప్పాడు.
ఆటోమొబైల్ సంస్థ టెస్లా, అంతరిక్షరంగానికి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీలకు మస్క్ అధిపతి. ఈ ఏడాది 44 వందల కోట్ల డాలర్లతో మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

