Elon Musk: బైడెన్ దేశద్రోహానికి పాల్పడ్డారు: ఎలన్ మస్క్
Elon Musk: జో బైడెన్ దేశ ద్రోహానికి పాల్పడినట్లు అమెరికా బిలియనీర్ ఎలన్ మస్క్ ఆరోపించారు. మెక్సికో బోర్డర్ గోడ నిర్మాణం కోసం తెచ్చిన సామాగ్రిని అమ్మేసుకుని, అక్రమ వలసదారులు దేశంలోకి చొరబడేలా చేశారని విమర్శించారు.
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. దేశ ద్రోహానికి పాల్పడినట్లు బిలియనీర్ ఎలన్ మస్క్(Elon Musk) ఆరోపించారు. అక్రమ వలసదారులు దేశంలోకి చొరబడేలా చేశారన్నారు. అమెరికా, మెక్సికో బోర్డర్ గోడ నిర్మాణం కోసం తెచ్చిన సామాగ్రిని అమ్మేసుకున్నట్లు బైడెన్‌పై మస్క్ విమర్శలు చేశారు. అమెరికా సరిహద్దుల్ని భద్రపరచడంలో బైడెన్ విఫలమైనట్లు దేశాధ్యక్షుడిగా ఎన్నికై ట్రంప్, రిపబ్లికన్లు విమర్శిస్తూనే ఉన్నారు. బోర్డర్ వాల్ నిర్మాణం కోసం తెచ్చిన సామాగ్రిని అమ్ముతున్నట్లు డిసెంబర్లో వార్తలు వ్యాపించడంతో.. బైడెన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిహద్దుల్ని రక్షించుకోలేకపోవడం దేశద్రోహం అవుతుందని ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు మస్క్ రియాక్ట్ అయ్యారు. అవును అది నూరు శాతం దేశద్రోహమే అవుతుందని తన ట్విట్టర్ ఖాతాలో మస్క్ పేర్కొన్నారు.
💯 Treason https://t.co/OdKfSXc5DA
— Elon Musk (@elonmusk) January 2, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

