Rishi Sunak | తూర్పు ఆఫ్రికా టు యూకే.. రిషి సునాక్ ఫ్యామిలీ ఇలా
Rishi Sunak | భారత సంతతికి చెందిన జనరల్ ప్రాక్టీషనర్ యశ్వీర్, ఫార్మసిస్ట్ ఉషలకు 1980 మే 12న జన్మించారు.
Rishi Sunak | భారత సంతతికి చెందిన జనరల్ ప్రాక్టీషనర్ యశ్వీర్, ఫార్మసిస్ట్ ఉషలకు యునైటెడ్ కింగ్డమ్లో రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. నిత్యం తన మూలాలను ఆయన వెల్లడిస్తూనే ఉంటారు. బ్రిటన్ ఖజానా చాన్స్‌లర్‌గా ఎన్నికైన భారత సంతతి తొలి నేత. . ఆయన పూర్వీకులు పంజాబ్ రాష్ట్ర వాసులు. వారు తొలుత తూర్పు ఆఫ్రికాకు.. అక్కడి నుంచి పిల్లలతో సహా యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్వీర్ కెన్యాలో.. తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్‌కు వలసవెళ్లాక వివాహం చేసుకున్నారు.
కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లో ఇన్ఫోసిస్ సహా-వ్యవస్థాపకుడు నారాయణమూర్తి – సుధామూర్తి దంపతుల కూతురు అక్షత మూర్తితో ప్రేమలో పడ్డారు. అక్షత మూర్తి కుటుంబం సంపదపై నిత్యం ప్రత్యర్థులు చేస్తున్న రిషి సునాక్ తిప్పి కొట్టారు. ‘నా అత్తామామలు నిర్మించిన వ్యవస్థ పట్ల నేను గర్వ పడతాను’ అని ఇటీవల టీవీ చానెల్స్‌లో జరిగిన చర్చాగోష్టుల్లో చెప్పారు.
సౌథాంప్టన్‌లో జన్మించిన రిషి సునాక్ ఒక హిందూ భక్తుడు. సౌథాంప్టన్‌లో నిత్యం దేవాలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. రిషి సునాక్, అక్షత మూర్తి దంపతులకు అనూక్ష, కృష్ణ అనే కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ భారత సంస్కృతి సంప్రదాయాల మూలాల ఆధారంగానే పెరిగారు. గత జూన్‌లో వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో క్వీన్ ప్లాటినం జుబ్లీ ఉత్సవాల్లో అనూక్ష తన క్లాస్‌మేట్స్‌తో కలిసి కూచిపూడి నృత్యం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

