Earthquake | భూ ప్రకంపణలతో మరోసారి వణికిన హిమాలయ దేశం
హిమాలయ దేశం నేపాల్‌లో (Nepal) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 1.20 గంటలకు మక్వాన్పూర్ (Makwanpur) జిల్లాలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.5గా నమోదయింది.
కఠ్మండూ: హిమాలయ దేశం నేపాల్‌లో (Nepal) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 1.20 గంటలకు మక్వాన్పూర్ (Makwanpur) జిల్లాలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని నేపాల్ సీస్మోలజికల్ సెంటర్ (NSC) తెలిపింది. భూకంప కేంద్రం చిట్లాంగ్‌లో (Chitlang( ఉన్నదని వెల్లడించింది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
కాగా, ఈనెల 3న నేపాల్‌లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి. దీంతో 157 మంది మరణించారు. దీనిప్రభావంతో ఉత్తర భారతదేశంలో భూమి కంపించింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

