Earthquake | టిబెట్‌ను వణికించిన వరుస భూకంపాలు.. గంటలోనే మూడుసార్లు..!
Earthquake | వరుస భూకంపాలతో టిబెట్ వణికిపోయింది. వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. దాదాపు గంట సమయంలో మూడుసార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. దాంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
Earthquake | వరుస భూకంపాలతో టిబెట్ వణికిపోయింది. వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. దాదాపు గంట సమయంలో మూడుసార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. దాంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి జనం పరుగులు పెట్టారు. మొదట భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున 2.41 గంటలకు బలమైన ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) పేర్కొంది.
భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు సిస్మోలజీ తెలిపింది. రెండోసారి ఉదయం 3.06 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రత నమోదైంది. గ్యాంగ్‌టక్‌కు 151 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చాయని పేరొంది. ఇక ఉదయం 3.48 గంటల ప్రాంతంలో మూడోసారి ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. భూమికి పది కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు గుర్తించినట్లు చెప్పింది. అయితే, భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అధికార వర్గాలు తెలిపాయి. పరిపాలన, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | రాముడిగా మహేష్ బాబు.. ‘వారణాసి’లో రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా,అసలు ట్విస్ట్ ఇదే!
OTT Movies | ఈ శుక్రవారం ఓటీటీలో సందడి.. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
Nandi Awards | నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 9 ఏళ్ల పురస్కారాలు ఒకేసారి, డిసెంబర్లో గ్రాండ్ ఈవెంట్!
Hyderabad | ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
MG University | మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థుల ఘర్షణ.. రెండు వర్గాలుగా విడిపోయి దాడులు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

