Dutch Princesses | ఇద్దరు డచ్ రాకుమార్తెల హత్యకు కుట్ర.. నిందితుడి అరెస్ట్
Dutch Princesses | నెదర్లాండ్స్ (Nedarlands) లో ఇద్దరు రాకుమార్తెల హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని అరెస్ట్ (Arrest) చేశారు. ఈ ఘటన ఆ దేశంలో సంచలనం సృష్టిస్తోంది. డచ్ సింహాసనానికి వారసురాలైన 22 ఏళ్ల యువరాణి కాథరినా అమాలియా (Catharina-Amalia).. 20 ఏళ్ల ఆమె సోదరి, యువరాణి అలెక్సియా (Alexia) లే లక్ష్యంగా దాడికి ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Dutch Princesses : నెదర్లాండ్స్ (Nedarlands) లో ఇద్దరు రాకుమార్తెల హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని అరెస్ట్ (Arrest) చేశారు. ఈ ఘటన ఆ దేశంలో సంచలనం సృష్టిస్తోంది. డచ్ సింహాసనానికి వారసురాలైన 22 ఏళ్ల యువరాణి కాథరినా అమాలియా (Catharina-Amalia).. 20 ఏళ్ల ఆమె సోదరి, యువరాణి అలెక్సియా (Alexia) లే లక్ష్యంగా దాడికి ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హేగ్ నగరంలో 33 ఏళ్ల వ్యక్తిని పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రెండు గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గొడ్డలిపై ‘అలెక్సియా’, ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ ‘మొస్సాద్’, నాజీ నినాదమైన ‘సీగ్ హీల్’ వంటి పదాలు చెక్కి ఉండటం తీవ్ర కలకలం రేపింది. దాంతోపాటు ‘అమాలియా’, ‘అలెక్సియా’, ‘బ్లడ్‌బాత్’ అని రాసి ఉన్న చేతిరాత నోట్‌ను కూడా అధికారులు కనుగొన్నారు.
ఈ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం తాజాగా వెల్లడించింది. నిందితుడి తరఫు న్యాయవాది కోర్టు విచారణకు ముందు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. కాగా డచ్ రాజకుటుంబం కూడా ఈ ఘటనపై తక్షణమే స్పందించలేదు. అయితే యువరాణి అమాలియాకు భద్రతాపరమైన ముప్పు ఎదురవడం ఇది మొదటిసారి కాదు. 2022లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ముఠాల నుంచి తీవ్రమైన బెదిరింపులు రావడంతో ఆమె ఆమ్స్టర్డామ్లోని విద్యార్థి వసతి గృహాన్ని విడిచిపెట్టి, దాదాపు ఏడాదిపాటు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో నివసించాల్సి వచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

