లండన్, డిసెంబర్ 2: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా? అయితే, మీకు చేదువార్తే. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే అనారోగ్యం తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సరిగా నిద్ర లేకుండా, పొద్దున లేచాక బ్లాక్ కాఫీ తాగితే రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణ కోల్పోతాయని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాత్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న 29 మంది పురుషులు, మహిళలపై వారు అధ్యయనం నిర్వహించారు. జీవ క్రియ దెబ్బతింటున్నట్టు గుర్తించామని వెల్లడించారు.