రష్యా తొలి మహిళా సర్జన్ డాక్టర్ వెరా 151 జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్

మాస్కో: రష్యా తొలి మహిళా సర్జన్, ప్రొఫెసర్, కవి, రచయిత డాక్టర్ వెరా గెడ్రోయిట్స్ 151 జయంతి సందర్భంగా సోమవారం ప్రత్యేక డూడుల్‌తో గూగుల్ నివాళి అర్పించింది. ప్రతికూలతలను అధిగమించి వైద్యాన్ని ప్రపంచం ముందుకు తెచ్చిన ఆమెకు ధన్యవాదాలు తెలిపింది. డాక్టర్ గెడ్రోయిట్స్ రష్యా తొలి మహిళా మిలటరీ సర్జనేగాక ప్రపంచంలోని మొట్టమొదటి మహిళా శస్త్రచికిత్స ప్రొఫెసర్లలో ఒకరు.
1870 లో కీవ్‌లోని లిథువేనియన్ రాజ సంతతికి చెందిన ఒక ప్రముఖ కుటుంబంలో గెడ్రోయిట్స్ జన్మించారు. యుక్తవయసులో స్విట్జర్లాండ్‌కు వెళ్లి వైద్య విద్యను అభ్యసించారు. 20 వ శతాబ్దం ప్రారంభంలో రష్యాకు తిరిగి వచ్చారు. ఫ్యాక్టరీ ఆసుపత్రిలో సర్జన్‌గా వైద్య వ`త్తిని ప్రారంభించారు.
1904 లో రష్యా, జపాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు డాక్టర్ గెడ్రోయిట్స్ రెడ్‌క్రాస్ ఆసుపత్రి రైలులో సర్జన్‌గా స్వచ్ఛందంగా సేవలందించారు. శత్రు కాల్పులకు బెదరక గాయపడిన సైనికులకు రైల్వే కారులో సంక్లిష్టమైన సర్జన్లు చేశారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో ఆమె వినియోగించిన సాంకేతికతను రష్యా ప్రభుత్వం కొత్త ప్రమాణంగా స్వీకరించింది. యుద్ధభూమిలో సేవల తరువాత డాక్టర్ గెడ్రోయిట్స్ రష్యా రాజకుటుంబానికి సర్జన్‌గా పనిచేశారు.
1929 లో కీవ్ విశ్వవిద్యాలయంలో శస్త్రచికిత్స ప్రొఫెసర్‌గా డాక్టర్ గెడ్రోయిట్స్ నియమితులయ్యారు, ప్రొఫెసర్‌గా ఉన్న సమయంలో పోషకాహారం, శస్త్రచికిత్సలపై అనేక వైద్య రచనలు చేశారు. అనేక కవితల సంకలనాలను కూడా ప్రచురించారు. 1931లో తన జ్ఞాపకాలతో సహా “లైఫ్” అనే పేరుతో అనేక కల్పిత రచనలు ప్రచురించారు. 1904లో సరిహద్దులో వైద్య సేవలకు దారి తీసిన తన వ్యక్తిగత జీవిత ప్రయాణాన్ని కూడా ఒక కథగా మలిచారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

