Drones Attack: క్రిమియాపై డజన్ల సంఖ్యలో డ్రోన్లతో దాడి.. 28 యూఏవీలను కూల్చేశామన్న రష్యా
Drones Attack: డజన్ల సంఖ్యలో డ్రోన్లు.. క్రిమియాపై అటాక్ చేశాయి. ఈ విషయాన్ని రష్యా మిలిటరీ పేర్కొన్నది. మొత్తం 28 యూఏవీలను కూల్చినట్లు రష్యా సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
మాస్కో: క్రిమియా ద్వీపకల్పంపై సామూహిక డ్రోన్ల దాడి(Drones Attack) జరిగినట్లు రష్యా మిలిటరీ పేర్కొన్నది. అయితే ఆ ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొన్నట్లు రక్షణ శాఖ తెలిపింది. డజన్ల సంఖ్యలో డ్రోన్లను కూల్చివేశామని, కొన్నింటిని ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వీర్యం చేసినట్లు రష్యా మిలిటరీ వెల్లడించింది. ఉక్రెయిన్‌కు చెందిన 17 యూఏవీలను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసిందని, మరో 11 యూఏవీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వీర్యం చేశామని రష్యా సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ దాడి వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని క్రిమియా గవర్నర్ సెర్గీ అక్సియోనోవ్ తెలిపారు.
రెండు రోజుల క్రితమే క్రిమియా బ్రిడ్జ్‌పై ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో ఇద్దరు పౌరులు మృతిచెందారు. బ్రిడ్జ్‌ను కూల్చేందుకు డ్రోన్లను ఉక్రెయిన్ వాడినట్లు రష్యా ఆరోపిస్తోంది. ఆ దాడి వల్ల బ్రిడ్జ్ రోడ్డుపై ఓ భాగం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. గత ఆదివారం సెవస్తిపోల్ సిటీపై కూడా ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసినట్లు భావిస్తున్నారు. 8 ఏరియల్, రెండు నావల్ సెమీ సబ్మెర్సిబుల్ డ్రోన్లతో ఉక్రెయిన్ అటాక్ చేసిందని రష్యా తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Crimea
- drones
- russian army
- UAVs
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

