పల్మాపై మిలిటెంట్ల దాడి.. డజన్ల సంఖ్యలో మృతులు

పల్మా: ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. పల్మా పట్టణాన్ని సీజ్ చేశారు. ఆ నగరంపై దాడి జరిగిన ఘటనలో డజన్ల సంఖ్యలో జనం మృతిచెందినట్లు తెలుస్తోంది. ఓ హోటల్ దిగ్బంధం నుంచి పరారీ అవుతున్నవారిలో ఏడుగురు హతమైనట్లు స్థానికులు తెలిపారు. వందల సంఖ్యలో స్థానికులు, విదేశీయులను రక్షించినట్లు అధికారులు చెప్పారు. బుధవారం నుంచి పల్మా నగరంలో ఇస్లామిక్ మిలిటెంట్లు భీకర దాడులు చేస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఇంధన సంస్థ .. పల్మా సమీపంలో ఉన్నది. మిలిటెంట్ల దాడితో సుమారు వంద మంది అమరులా పల్మా హోటల్లో తలదాచుకున్నారు.
పోర్టు పట్టణమైన పల్మా నుంచి జనం తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కార్గో వెసల్స్, ప్యాసింజర్ షిప్‌లు, టగ్స్, రిక్రియేషనల్ బోట్ల ద్వారా ఎస్కేప్ అయ్యేందుకు జనం ప్రయత్నించారు. పల్మా నుంచి 1400 మందితో బయలుదేరిన ఓ బోటు పెంబా పట్టణానికి చెరుకున్నట్లు ఓ అధికారి చెప్పారు. మిలిటెంట్ల దాడితో పల్మా నగరం నుంచి ఇప్పటి వరకు సుమారు 35 వేల మంది పరారీ అయినట్లు తెలుస్తోంది. ఫ్రెంచ్ ఇంధన కంపెనీని టార్గెట్ చేస్తూ మిలిటెంట్ల పల్మా నగరంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ కంపెనీకి మాత్రం మొజాంబిక్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అల్ సున్నా వా జమా మిలిటెంట్ సంస్థ ఈ దాడులకు ప్రయత్నించినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

