అక్కడ గోడలపై మూత్రం పోశారంటే అంతే సంగతి.. ఎక్కడో ఎందుకో తెలుసా..?
Anti-pee paint | సాధారణంగా పురుషుల్లో చాలామంది రోడ్లపై వెళ్తున్నప్పుడు మూత్రం ఆత్రంగా వస్తే బాత్రూమ్ల గురించి ఆలోచించరు. బాత్రూమ్ల కోసం వెతకడం కంటే గోడకేసి పాట పాడటమే
లండన్: సాధారణంగా పురుషుల్లో చాలామంది రోడ్లపై వెళ్తున్నప్పుడు మూత్రం ఆత్రంగా వస్తే బాత్రూమ్ల గురించి ఆలోచించరు. బాత్రూమ్ల కోసం వెతకడం కంటే గోడకేసి పాట పాడటమే మేలని భావిస్తారు. బాటసారులుగానీ, బైకర్లుగానీ, మరే ఇతర వాహనాల్లో వెళ్లేవారుగానీ ఖాళీ గోడ కనపడిందంటే వాహనం ఆపేసి పని కానిచ్చేస్తారు. దాంతో నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే పరిసరాలు అపరిశుభ్రంగా మారుతాయి. భరించలేని దుర్గంధాన్ని వెదజల్లుతాయి. దాంతో ఆయా ప్రదేశాల గుండా వెళ్లాలంటే ముక్కులు మూసుకుని నడవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది.
అయితే ఈ కంపు సమస్యకు చెక్‌పెట్టేందుకు లండన్‌లోని సెంట్రల్ డిస్ట్రిక్ట్ అయిన వెస్ట్‌మినిస్టర్ సిటీ అధికార యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఎవరైనా గోడలపై మూత్ర విసర్జన చేస్తే అది తిరిగి వాళ్లే మీదే పడేలా ప్లాన్ చేసింది. ఇందుకోసం యాంటీ పీ-పెయింట్‌ను గోడలపై స్ప్రే చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ మేరకు వెస్ట్‌మినిస్టర్ సిటీలోని రద్దీ ప్రదేశాలన్నింటిలో గోడలపై యాంటీ పీ-పెయింట్‌ను స్ప్రే చేయిస్తున్నది.
ఈ యాంటీ పీ-పెయింట్‌ను స్ప్రే చేసిన గోడలపై ఎవరైనా మూత్రవిసర్జనకు ప్రయత్నిస్తే.. అది తిరిగి మూత్రం పోస్తున్న వ్యక్తిపైకే విరజిమ్ముతుందట. దాంతో గోడలపై మూత్రవిసర్జన చేసేవాళ్లు షాకవక తప్పదట. అయితే ఈ గోడలపై తెలియక మూత్రవిసర్జన చేసే పరిస్థితి ఉండదట. ఎందుకంటే ఈ పెయింట్ వేసిన గోడలపై ‘దిస్ వాల్ ఈజ్ నాట్ ఎ యూరినల్’ అని హెచ్చరికలు రాసిపెడుతున్నారట.
అంటే హెచ్చరికను లెక్క చేయకుండా మూత్రవిసర్జనకు ప్రయత్నించేవారు మాత్రమే ఈ యాంటీ పీ-పెయింట్‌తో అబాసుపాలు కావాల్సి వస్తుందన్నమాట. అయితే వెస్ట్‌మినిస్టర్ సిటీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి పరిశుభ్రత ఒక్కటే కారణం కాదట. ఖర్చును తగ్గించుకోవడం కూడా ఒక కారణమట. ఆ జిల్లాలో యూరినేటెడ్ గోడలను శుభ్రం చేయించడానికి ఏటా 12.4 లక్షల డాలర్లు ఖర్చవుతున్నదట. అందుకే యాంటీ పీ-పెయింట్ ద్వారా ఆ ఖర్చు తగ్గే చాన్స్ ఉందని వెస్ట్‌మినిస్టర్ అధికారులు భావిస్తున్నారట.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

