US Midterm Elections: వీటో క్యాప్ పోస్టు చేసిన ట్రంప్
US Midterm Elections: డెమోక్రాట్ల మద్దతు ఉన్న బిల్లులను తన వీటో అధికారంతో అడ్డుకోనున్నట్లు ట్రంప్ తెలిపారు. కాంగ్రెస్ ఉభయసభలను డెమోక్రటిక్ పార్టీ చేజిక్కించుకున్న నేపథ్యంలో ఆయన తన ట్రుత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. ఎరుపు రంగు వీటో క్యాప్‌ను ఆయన పోస్టు చేశారు.
న్యూయార్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో(US Midterm Elections) రిపబ్లికన్ పార్టీ భారీ జలక్ తగిలింది. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌తో పాటు సేనేట్లోనూ డెమోక్రటిక్ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రుత్ సోషల్ అకౌంట్లో కీలక పోస్టు చేశారు. తనకు వీటో పవర్ ఉన్నట్లు ఓ పోస్టు ద్వారా రెడ్ కలర్ క్యాప్‌ను పోస్టు చేశారు. రాబోయే రెండేళ్లు ట్రంప్‌కు గడ్డుకాలం ఉండబోనున్న విషయం ఫలితాల ద్వారా స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ ఉభయసభల్లో ఏదైనా బిల్లును ఒకవేళ ప్రతిపక్షం అడ్డుకుంటే అప్పుడు తన వీటో అధికారాన్ని వాడనున్నట్లు ట్రంప్ తన పోస్టు ద్వారా తెలిపారు. డెమోక్రాట్ల మద్దతు ఉన్న బిల్లులను తన వీటో అధికారంతో అడ్డుకోనున్న విషయాన్ని ఆయన తన పోస్టు ద్వార వెల్లడించారు.
వీటో అనేది దేశాధ్యక్షుడి వద్ద ఉన్న బలమైన అధికారం అని, పిచ్చి బిల్లులు పాస్ చేస్తే, తాను వీటో చేయబోనున్నట్లు ట్రంప్ చెప్పారు. వీటోతో కొన్ని బిల్లులను అడ్డుకుంటే, అప్పుడు వాళ్లు తలలు పట్టుకుంటారన్నారు. డెమోక్రాట్ల పార్టీలో తనకు తెలిసిన నేతలు ఉన్నారని, వారితో ఇప్పటికే మాట్లాడానని, ఇంకా కొందరు తనతో టచ్‌లో వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారన్నారు. మంచికి చెడుకు తాను పొలిటికల్ పండితుడిని కాబోతున్నట్లు మరో పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Midterm Elections: వీటో క్యాప్ పోస్టు చేసిన ట్రంప్
Conductor Pravalika | కండక్టర్ ప్రవళిక తల్లికి ఉద్యోగం.. రూ.10లక్షల పరిహారం ప్రకటించిన పొన్నం.. ప్రయాణికురాలిపై హత్య కేసు!
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

