ఘనాలో మార్బర్గ్ వైరస్
ఆఫ్రికా దేశం ఘనాలో ప్రమాదకరమైన ‘మార్బర్గ్' వైరస్ వెలుగుచూసింది. ఇప్పటికే దేశంలో రెండు కేసులు వెలుగుచూసినట్టు అధికారులు ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు ఈ వైరస్ సోకినట్టు వెల్లడించారు. ఘనాలో ‘మార్బర్గ్' కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్వో ధ్రువీకరించింది
- వెలుగులోకి మరో కొత్త రకం
- వ్యాధితో ఇప్పటికే ఇద్దరు మృతి
- అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
అక్రా, జూలై 18: ఆఫ్రికా దేశం ఘనాలో ప్రమాదకరమైన ‘మార్బర్గ్’ వైరస్ వెలుగుచూసింది. ఇప్పటికే దేశంలో రెండు కేసులు వెలుగుచూసినట్టు అధికారులు ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు ఈ వైరస్ సోకినట్టు వెల్లడించారు. ఘనాలో ‘మార్బర్గ్’ కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్వో ధ్రువీకరించింది. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆఫ్రికాలో మార్బర్గ్ వెలుగు చూడటం తొలిసారేమీ కాదు. గత ఏడాది గినియాలో తొలి కేసు నమోదైంది. తర్వాత వెలుగుచూడలేదు. గినియాకు ముందు అంగోలా, కాంగో, కెన్యా, దక్షిణాఫ్రికా, ఉగాండాలో కూడా ‘మార్బర్గ్’ కేసులు నమోదైనప్పటికీ, వైరస్ వ్యాప్తి అప్పుడు నియంత్రణలో ఉండటంతో కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదుకాలేదు.
ఏమిటీ వైరస్?
ఎబోలా కుటుంబానికి చెందిన వైరసే ‘మార్బర్గ్’. ఇది అత్యంత ప్రాణాంతకమైనదని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. ఈ వైరస్ సోకిన వారు మరణించే అవకాశం 24 శాతం నుంచి 88 శాతం వరకు ఉండవచ్చని పేర్కొంది.
ఎలా వ్యాపిస్తుంది?
ఫ్రూట్ బ్యాట్స్ నుంచి ప్రధానంగా ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. రోగి గాయాలు తాకడం, బాధితుడి రక్తం, స్రావాలు పడిన వస్తువులను ముట్టుకోవడంతో ఈ వైరస్ ఇతరులకు సోకుతుంది. ఉగాండా నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ గ్రీన్ మంకీల్లో తొలుత ఈ వైరస్ గుర్తించినట్టు అంచనా వేస్తున్నారు.
లక్షణాలు ఏమిటి?
జ్వరం, అస్వస్థత, కండరాల నొప్పి, నీళ్ల విరేచనాలు, తిమ్మిర్లు, కడుపునొప్పి, నీరసం, రక్తస్రావం, నెత్తుటి వాంతులు, మలంలో రక్తం రావడం.
వ్యాక్సిన్ అందుబాటులో ఉందా?
ప్రస్తుతానికైతే, ‘మార్బర్గ్’ వైరస్ నియంత్రణకు ఎలాంటి వ్యాక్సిన్, ఔషధాలు అందుబాటులో లేవు. స్లైన్, ఫ్ల్యూయిడ్స్ ఎక్కిస్తూ తగిన చికిత్స అందిస్తే రోగి కోలుకునే అవకాశమున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- African country
- deadly
- Ebola
- Ghana
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

