IMF | పాకిస్థాన్‌కు బిలియన్ డాలర్ల సాయాన్ని సమర్థించుకున్న ఐఎంఎఫ్
IMF | అప్పుల్లో కూరుకుపోయిన దాయాది పాకిస్థాన్‌కు బిలియన్ డాలర్ల (రూ. 8,000 కోట్లకు పైగా) ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వడాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సమర్థించుకుంది.
IMF | అప్పుల్లో కూరుకుపోయిన దాయాది పాకిస్థాన్‌కు బిలియన్ డాలర్ల (రూ. 8,000 కోట్లకు పైగా) ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వడాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సమర్థించుకుంది. అప్పుల్లో కూరుకుపోయిన ఆ దేశం ఈ రుణాన్ని పొందేందుకు అవసరమైన అన్ని లక్ష్యాలను చేరుకుందని వ్యాఖ్యానించింది. అందుకే ఈ తాజా విడత రుణాన్ని అందించినట్లు స్పష్టం చేసింది.
కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాదికి ప్రపంచ బ్యాంక్ ఉద్దీపన ప్యాకేజీ రూపంలో భారీ ఊరటనిచ్చింది. ఉద్దీపన ప్యాకేజీ కింద 2 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అయితే, ఐఎమ్ఎఫ్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాకిస్థాన్ తన భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవడానికి అనుమతిస్తోందని, ఆ దేశానికి అందిస్తున్న ఆర్థిక సహాయం ‘ఉగ్రవాదానికి పరోక్షంగా నిధులు సమకూర్చినట్లే’ అవుతుందని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయినప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 1 బిలియన్ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540 కోట్లు) ఆ దేశానికి మంజూరయ్యాయి. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (Extended Fund Facility) కింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది.
ఇక ఐఎమ్ఎఫ్ నిధులు విడుదల వేళ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భారత్ చేసిన వైమానిక దాడుల్లో 14 మంది మసూద్ కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని ఆ దేశ ప్రధాని పేర్కొన్నారు.
ఈ క్రమంలో కేవలం మసూద్ కుటుంబానికి రూ.14 కోట్లు చెల్లించే అవకాశం ఉంది. అదనంగా భారత్ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లను పునర్నిర్మిస్తామని పాక్ ప్రధాని హామీ ఇచ్చారు. కాగా, ఐఎంఎఫ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్) కార్యక్రమం కింద పాకిస్థాన్‌కు ఇప్పటివరకు రెండు విడతల్లో 2.1 బిలియన్ డాలర్లు అందజేసింది. గత ఏడాది ఈఎఫ్ఎఫ్ కింద 7 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది.
Also Read..
IndiGo | గగనతలంలో అల్లకల్లోలం.. ఇండిగో అభ్యర్థనను తిరస్కరించిన పాక్
Muhammad Yunus | రాజీనామా యోచనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

