ఫ్రాన్స్‌లో రక్త నిల్వ కేంద్రాలపై సైబర్ దాడి
ఫ్రాన్స్‌లో రక్తం, ప్లాస్మా నిల్వ చేసే కేంద్రాలపై హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడ్డారు. అక్కడి రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రతలను అత్యంత ప్రమాదకర స్థాయికి పెంచేందుకు ప్రయత్నించారు.
పారిస్ : ఫ్రాన్స్‌లో రక్తం, ప్లాస్మా నిల్వ చేసే కేంద్రాలపై హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడ్డారు. అక్కడి రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రతలను అత్యంత ప్రమాదకర స్థాయికి పెంచేందుకు ప్రయత్నించారు. అయితే పర్యవేక్షణ వ్యవస్థలు వెంటనే అప్రమత్తం చేయడంతో సిబ్బంది సకాలంలో స్పందించారు. దీంతో రక్త నమూనాలు, రక్త ఉత్పత్తులకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
ఫ్రాన్స్ జాతీయ రక్త సేవా సంస్థకు చెందిన మూడు కేంద్రాల్లో నవంబర్ 2న ఈ ఘటన చోటుచేసుకుంది. రిఫ్రిజిరేషన్ పరికరాలను నిర్వహించే ఓ ప్రైవేటు సరఫరాదారు సంస్థ వ్యవస్థలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో కోల్డ్ స్టోరేజీ గదుల ఉష్ణోగ్రత నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థల్లోకి చొరబడి వాటి సెట్టింగులను మార్చారు. ఉష్ణోగ్రతతో పాటు డీఫ్రాస్టింగ్ పరిమితులనూ అత్యధిక స్థాయికి పెంచారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

