ఫ్రాన్స్‌లో వందలాది సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి
ఫ్రాన్స్‌లో వందలాది సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి జరిగింది. రిఫ్రిజిరేషన్ వ్యవస్థల ధ్వంసం లక్ష్యంగా ఈ దాడి జరిగింది. దీని కారణంగా దేశవ్యాప్తంగా 480 దుకాణాలు, స్టోర్లలోని ఫ్రిజ్‌లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుని అధిక ఉష్ణోగ్రతకు పలు స్టోర్లలోని ఫ్రిజ్‌లకు మంటలంటుకున్నాయి. కోట్లాది యూరోల నష్టం ఏర్పడిన ఈ తరహా సైబర్ దాడి దేశంలో ఇదే ప్రథమమని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.
- ఫ్రిజ్‌లలో ‘50’ దాటిన ఉష్ణోగ్రతలు
- పెద్దమొత్తంలో పాడైపోయిన ఆహారం
- కొన్ని స్టోర్లలో చెలరేగిన మంటలు
పారిస్: ఫ్రాన్స్‌లో వందలాది సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి జరిగింది. రిఫ్రిజిరేషన్ వ్యవస్థల ధ్వంసం లక్ష్యంగా ఈ దాడి జరిగింది. దీని కారణంగా దేశవ్యాప్తంగా 480 దుకాణాలు, స్టోర్లలోని ఫ్రిజ్‌లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుని అధిక ఉష్ణోగ్రతకు పలు స్టోర్లలోని ఫ్రిజ్‌లకు మంటలంటుకున్నాయి. కోట్లాది యూరోల నష్టం ఏర్పడిన ఈ తరహా సైబర్ దాడి దేశంలో ఇదే ప్రథమమని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఫ్రెంచ్ మీడియా కథనం ప్రకారం చాలా స్టోర్లలోని ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లు ఆటోమేటిక్‌గా డీఫ్రాస్ట్ మోడ్‌లోకి వెళ్లేలా హ్యాకర్లు సైబర్ దాడి చేశారు. దీంతో తాజా, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు పాడవ్వడమే కాక, అధిక ఉష్ణోగ్రతకు పేలుడు సంభవించి మంటల్లో చిక్కుకున్నాయి.
పలు స్టోర్లలోని ఫ్రిజ్‌లు మంటల్లో చిక్కుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరపాలని ఫ్రెంచి ప్రధాని లెకోర్న్ దేశ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఏఎన్ఎస్ఎస్ఐను ఆదేశించారు. ఇతర ఐరోపా దేశాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయా? అని ప్రభుత్వం ఆరాతీస్తున్నది. పలు ఆహార రిటైల్ సంస్థల్లో ఇంటర్నెట్తో అనుసంధానించి ఉన్న రిఫ్రిజిరేటర్లపై ఈ దాడి జరిగిందని పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.
కాగా, ప్రధాని ఆఫీస్ అధికారి ప్రకారం డెన్మార్క్‌కు చెందిన డాన్‌ఫాస్ కంపెనీ సాఫ్ట్‌వేర్‌లో ఫ్రాన్స్ సైబర్ సెక్యూరిటీ ఒక లోపాన్ని గుర్తించింది. ఈ కంపెనీ సిస్టమ్‌లను సూపర్‌మార్కెట్ ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. కాగా, దుర్ఘటనలకు కారణమైన సిస్టమ్‌లలో కంపెనీ సాఫ్ట్వేర్ పాత వెర్షన్ నడుస్తున్నది.తమ సాఫ్ట్వేర్లను అప్డేట్ చేసుకోవాలని, పాతబడిన పరికరాలను మార్చుకోవాలని చాన్నాళ్లుగా తమ వినియోగదారులకు సలహాలు ఇస్తున్నట్టు ఆ కంపెనీ తెలిపింది.
ఎలా జరిగింది?
సూపర్‌మార్కెట్ ఫ్రిజ్‌లు, ఫీజర్లు సాధారణంగా స్టోర్ మొత్తం రిఫ్రిజిరేషన్ ప్రక్రియను నిర్వహించే ఒక కంట్రోల్ ప్యానల్ వ్యవస్థ ద్వారా పనిచేస్తాయి. ఈ ప్యానెళ్లు ఇంటర్నెట్కు అనుసంధానించి ఉంటాయి. కాబట్టి నిర్వహణ సంస్థలు వాటి సెట్టింగ్‌లను రిమోట్‌గా మార్చగలవు. ఒక వేళ హ్యాకర్ ఈ వ్యవస్థలోకి ప్రవేశించగలిగితే వారు భద్రతా లోపాలను ఉపయోగించుకుని ఫ్రిజ్‌లు, ఫ్రీజర్ల సెట్టింగ్‌లను మార్చగలరు. దీనివల్ల వారు కూలింగ్‌ను తగ్గించడం, లేదా డీఫ్రాస్టింగ్కు మార్చగలరు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

