యూఎస్ ప్రెసిడెంట్ బిడెన్ కాసేపట్లో రష్యా నుంచి ఆయిల్ దిగుమతి విషయమై యూఎస్ మీడియాతో మాట్లాడనున్నారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్స్ ఇంపోర్ట్ను బిడెన్ బ్యాన్ చేసే అవకాశం ఉందని తెలుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ప్రస్తుతం 129.92 డాలర్ల వద్ద ఉంది. ఒకేసారి 5.45 శాతం పెరిగింది.
రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై అన్ని దేశాలు వెంటనే బ్యాన్ విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడటంపై అమెరికా మొదటి నుంచి ఆగ్రహంతోనే ఉంది. ఈనేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతిపై యూఎస్ నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని యూఎస్ మీడియా తాజాగా ప్రకటించింది.