Croatia Minister: జర్మనీ మహిళా మంత్రికి కిస్ ఇచ్చిన క్రొయేషియా మంత్రి.. వీడియో
Croatia Minister: క్రొయేషియా మంత్రి ఇచ్చిన కిస్ వివాదాస్పదమైంది. ఈయూ మీటింగ్‌లో జర్మనీ మంత్రి ఆయన కిస్ ఇచ్చారు. ఈయూ నేతలు ఆ మంత్రి చేష్టల్ని తప్పుపడుతున్నారు. విమర్శలు ఎక్కువ అవడంతో ఆ మంత్రి క్షమాపణలు చెప్పారు.
బ్రసెల్స్: క్రొయేషియా విదేశాంగ మంత్రి(Croatia Minister) గోర్డాన్ గిలిక్ డార్మాన్ వివాదంలో ఇరుకున్నారు. బెర్లిన్‌లో జరిగిన ఈయూ విదేశాంగ మంత్రుల మీటింగ్‌లో ఆయన జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలీనా బేర్‌బాక్‌కు కిస్ ఇచ్చారు. ఈ ఘటన పట్ల స్థానిక యురోపియన్ మీడియా గగ్గోలు చేస్తోంది. మంత్రి అన్నలీనాతో క్రొయేషియా మంత్రి అనుచితంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
విదేశాంగ మంత్రుల సమావేశానికి వచ్చిన వారికి వెల్కమ్ చెబుతున్న సమయంలో.. క్రొయేషియా మంత్రి అత్యుత్సాహంతో జర్మనీ మంత్రి చెంపపై కిస్ ఇచ్చారు. ఈ ఘటనపై దుమారం రేగడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. మంత్రుల్ని ఒకర్ని ఒకరు పలుకరించుకుంటారని, ఎవరైనా దీన్ని తప్పుగా భావిస్తే క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు.
ఈయూ విదేశాంగ మంత్రులు అందరూ గ్రూపు ఫోటో దిగుతున్న సమయంలో.. జర్మనీ మహిళా మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చిన క్రొయేషియా మంత్రి.. ఆ జోరులోనే ఆమె బుగ్గపై కిస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆ మహిళా మంత్రి తన ముఖాన్ని మంత్రి వైపు తిప్పింది. అయితే ఈ ఘటనపై కామెంట్ చేసేందుకు ఆ మహిళా మంత్రి నిరాకరించారు.
బలవంతంగా మహిళలకు ముద్దుపెట్టడం హింసే అవుతుందని క్రొయేషియా మాజీ ప్రధాని ఆరోపించారు. ఇటీవల స్పెయిన్ మంత్రి ఓ మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్‌కు కిస్ ఇచ్చిన అంశం పెను దుమారం సృష్టించిన విషయం తెలిసిందే.
03.11.2023.
dr. sc. Gordan Grlić Radman,
ministar vanjskih i europskih poslova
(02.11.2023.) pic.twitter.com/k20F8nZEFo— 🎖 🅽🅴🅲🅹🅴🅿🅸Š🅰 🎖 (@RashoVeljkov1) November 3, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

